Service Person : ప్రభుత్వ పాఠశాలల్లో సర్వీస్ పర్సన్స్‌ను యథావిధిగా కొనసాగించాలి:ఎఐటియుసిKhammam: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత పనులు సర్వీస్ పర్సన్స్(Service Person)తో చేయించాలని, వారిని యథావిధిగా కొనసాగిస్తూ, గ్రామ పంచాయతీ కార్మికులుగా గుర్తించాలని ఎఐటియుసి మున్సిపల్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, సర్వీసు పర్సన్స్ అసోయేషన్ జిల్లా కార్యదర్శి షేక్ రషీద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


సోమవారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట ఎఐటియుసి ఆధ్వర్యంలో సర్వీస్ పర్సన్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందంతో నిరసన తెలియజేశారు. అనంతరం సూపరిండెంట్ షేక్.జానిమియాకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న సర్వీస్ పర్సన్స్‌కు కనీస వేతనం ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 సంవత్సరం స్వచ్ఛా భారత్, హరితహారం పథకాల నిర్వహణలో భాగంగా తెలంగాణలో స్వచ్ఛ పాఠశాలల్లో పనిచేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల గౌరవ వేతనంతో పాఠశాలల్లో సర్వీస్ పర్సన్స్ నియమించారని గుర్తు చేశారు.
సర్వీస్ పర్సన్స్‌కు సక్రమంగా గౌరవ వేతనాలు ఇవ్వకున్నా ప్రభుత్వం ఎప్పటికైనా తమ బ్రతుకులు మారుతాయని ఆశతో పనిచేశారని అన్నారు. అటువంటి వారిని విధులకు దూరం చేయాలని దురుద్ధేశ్యంతో 2020 సంవత్సరం జూలై నెలలో రాష్ట్ర ప్రభుత్వం మెమో 2026 పేరుతో సర్వీస్ పర్సన్స్ పనిని గ్రామ పంచాయతీలకు అప్పగించారని పేర్కొన్నారు.


ఇప్పుడు సర్వీస్ పర్సన్స్ పరిస్థితి గందరగోళంగా మారిందని, వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమయ్యాయిని, ఫిబ్రవరి 1 నుంచి పూర్తి స్థాయిలో పాఠశాలలు తెరుచుకోవడంతో ఆ కార్మికులు అయోమయంలోకి నెట్టి వేయపడ్డారని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి సర్వీస్ పర్సన్స్‌ను పంచాయతీ కార్మికులుగా గుర్తించి వారికి కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సర్వీస్ పర్సన్స్ అసోసియేషన్ ఎఐటియుసి ఖమ్మం జిల్లా నాయకులు షేక్ గౌస్, భూక్యా దేవా, బోడా నాగేశ్వరరావు, చారి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండి: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బంధువు కిడ్నాప్,హత్య
ఇది చదవండి:పంచాయతీ తీర్పులో మాజీ సర్పంచ్‌పై కత్తితో
దాడిఇది చదవండి:మదనపల్లె కేసు వాదనకు ముందుకొచ్చిన సుప్రీంకోర్టు న్యాయవాది
ఇది చదవండి:భారత దేశంలో కార్మిక ఉద్యమ చరిత్ర పూర్వ పరిస్థితి!
ఇది చదవండి: జగన్ సన్నిహితులను నిమ్మగడ్డ టార్గెట్ చేశారా?
ఇది చదవండి:సర్పంచ్ అభ్యర్థిగా మహిళా వాలంటీర్ పోటీ ఎక్కడంటే?
ఇది చదవండి:ఎమ్మెల్యే మామయ్యకు అరుదైన గౌరవాన్ని తెచ్చిన ఐపిఎస్ కోడలు!
ఇది చదవండి:కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే కేబినెట్ మారుస్తారా?
ఇది చదవండి:మదనపల్లె హత్యలో దిమ్మతిరిగే ట్విస్ట్