Health Emergency : తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టబోమని సీఎం కేసీఆర్ స్ఫష్టం చేయడంపై ఇతర పార్టీల నుంచి, సామాజిక నాయకుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనాతో రోజుకు పదుల సంఖ్యలో చనిపోతుంటే లాక్డౌన్ పెట్టకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
Health Emergency : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ వైరస్ అరికట్టడానికి కర్ఫ్యూ(curfew) ఒక్కటే సరిపోదు రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని మున్సిపల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(ఏఐటియూసీ) మందా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కొద్ది రోజుల పాటు లాక్డౌన్ పెట్టడం సరైన మార్గమని తెలిపారు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచనలు ఉండాలి కానీ, సీఎం కేసీఆర్ మాత్రం లాక్డౌన్(lockdown) ఉండదనడం సరైనంది కాదని సూచించారు. రాష్ట్రంలో పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే మేధావులు రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడానికి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించకుంటే కరోనా విలయతాండ మవ్వడంతో పాటు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు కరోనా దెబ్బకు పిట్టల్లా రాలిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శించారు. కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చకుండా ప్రైవేటు హాస్పటిళ్లకు దోచిపెడుతున్నారని ఆరోపించారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కరోనా వచ్చినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉన్నారని, ఎవ్వరినీ కలవని వారికే కరోనా వస్తే మరి నిత్యం రోజువారీ పనిచేసి బ్రతికే సామాన్యుడికి కరోనా రాదా? అంటూ ప్రశ్నించారు. కరోనా విపత్తు సందర్భంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలకు, మధ్య తరగతి ప్రజలకు, కార్మికులకు ఆహార సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కరోనా తీవ్రను గమనించి రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా కొన్ని రోజుల పాటు లాక్డౌన్ పెట్టాలని మందా వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!