AITUC మహా సభలు జయప్రదం చేయండి: మందా వెంకటేశ్వర్లు
AITUC : ఖమ్మం : మున్సిపల్ రంగంలో కాంట్రాక్టు ఔటు సోర్సింగ్ విధానం రద్దు చేసి అందరినీ పర్మినెంట్ చేయాలని, 11వ పీఆర్సీ ప్రకారం కేటగిరీల వారిగా వేతనాలు నిర్ణయించి చెల్లించాలని సమాన పనికి సమాన వేతనం కనీస వేతనం రూ.24 వేలు చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
శుక్రవారం ఉదయం ఖమ్మం నగర పాలక సంస్థ పారిశుధ్య సిబ్బంది హాజరు పాయింట్ వద్ద మే నెల 22,23వ తేదీల్లో జరిగే ఖమ్మం జిల్లా ఏఐటియుసి మున్సిపల్ ఖమ్మం జిల్లా రెండో మహా సభల కరపత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పురపాలక సంఘాల్లో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ తదితర పద్ధతుల్లో పనిచేస్తున్న సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీ జీవో వెంటనే విడుదల చేయాలని అన్నారు.


మున్సిపల్ సిబ్బందికి కేటగిరిల వారీగా జీతాలు పెంచాలని మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది సమస్యలపై కేసీఆర్ ప్రభుత్వం మున్సిపల్ సిబ్బందికి ఇచ్చిన హామీలు అమలు కోసం ఏఐటియుసి మున్సిపల్ కార్మిక సంఘం భవిష్యత్ ఉద్యమాల నిర్వహణ తదితర అంశాలపై మహాసభలో నిర్ణయాలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు షేక్ హుస్సేన్, కందుల మహేష్, యం.రాంబబు, టి.రాములు, యం.శ్రీను, యం. శేఖర్ బాబు, పి.బాబు సిహెచ్.లలితా, పద్మా, యాకమ్మ తదితరులు పాల్గొన్నారు.
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started