Air India | చైనాలోని మళ్లీ కరోనా వైరస్ కేసుల సంఖ్యం పెరుగుతున్నాయి. హాంకాంగ్‌లో కరోనా టెన్షన్ మొదలైంది. అక్కడ ప్రజలపై అధికారులు పలు ఆంక్షలు విధించారు. తాజాగా ఆ దేశ అధికారుల ఆదేశాలతో భారత్ ఎయిర్ లైన్స్‌కు ప్రభావం చూపింది. కోవిడ్-19 పరిమితులు, పరిమిత డిమాండ్ కారణంగా ఎయిర్ ఇండియా హాంకాంగ్ కు విమాన సేవలను రద్దు చేసినట్టు విమానయాన సంస్థ తెలిపింది. హాంకాంగ్‌కు ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు విమానాలు రద్దు చేసినట్టు ఎయిల్ లైన్ తన ట్విట్టర్లో పేర్కొంది.
హాంకాంగ్‌కు Air India విమాన సర్వీసుల రద్దు
హాంకాంగ్‌లో మళ్లీ కరోనా విజృంభిస్తుండటంతో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. విమాన ప్రయానికి 48 గంటల ముందు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే భారత నుంచి హాంకాంగ్‌కు విమాన ప్రయాణం చేయవచ్చని ఆ దేశ అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఒమైక్రాన్ వేరియంట్ తీవ్రత ఎక్కువ అవ్వడంతో హాంకాంగ్ నిబంధనలు పటిష్టం చేసింది. భారతదేశంతో సహా 8 దేశాల నుంచి హాంకాంగ్‌కు విమానాల రాకపోకలపై రెండు వారాలపాటు నిషేధాన్ని ప్రకటించింది. శనివారం కోవిడ్-19 కారణంగా ముగ్గురు మృతి చెందారు. దీంతో విమానాలను నిషేధించినట్టు హాంకాంగ్ తెలిపింది.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!