AIDWA Khammam ఖమ్మం: నిత్యావసర ధరలు రోజు రోజుకూ పెంచుతూ సామాన్య పేదలపై ప్రభుత్వాలు పెను భారాలు మోపుతూ పాలన కొనసాగిస్తున్నాయని ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి అన్నారు. ఖమ్మం పట్టణ కేంద్రoలో ఐద్వా జిల్లా కమిటీ ఆద్వర్యంలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిచాలని ప్లేకార్డ్స్ తో నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్బంగా భారతి మాట్లాడుతూ ఎడేండ్ల మోడీ పాలనలో దేశంలో ధరలు ఆకాశానికి అంటాయిని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ,నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్య ప్రజల జీవనం దుర్బరంగా మారుతున్నా పాలకులు చలనం లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. కరోనా మూలంగా ఉపాధి కోలుపోయి పనులు లేక పేదలు అల్లాడుతుంటే పెరిగిన ధరలు ఇంకా ఇబ్బందిపడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చేస్తున్నాయని (AIDWA Khammam)అన్నారు.


ధరల నియంత్రణలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయన్నారు. వంట గ్యాస్ ధర వెయ్యి దాటిందన్నారు. మహిళలు మరల పాత పద్ధతిలో కట్టెలపొయ్యి తో తంటాలు పడే విధంగా ప్రభుత్వ తీరు ఉన్నదని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ట పరచి పేదలకు 14రకాల సరుకులను అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాల్లు మెరుగు రమణ, పత్తిపాక నాగసులోచన, బీబి, కుమారి, పావని, ఏటుకూరి పద్మ, ఉమీన తదితరులు పాల్గొన్నారు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!