African Wild Dog | ఈ ప్రపంచంలో చురుకైన, విజయవంతమైన జంతువు ఏది అంటే ఖచ్చితంగా సింహం, లేదా చిరుత అని మీకు తెలిసి ఉండొచ్చు. సింహం తన వేటలో 30% శాతం మాత్రమే విజయం సాధిస్తుంది. చిరుత తన వేటలో 50% శాతం మాత్రమే విజయం సాధిస్తుంది. మరీ పూర్తి విజయం సాధించే జంతువు ఏది?. అవును ఒక జంతువు ఉందండోయ్!. అదే ఆఫ్రికా వైల్డ్ డాగ్. ఇది వేటాడితే అవతలి జంతువు ఆహారం(African Wild Dog) కావాల్సిందే మరి!.
ఆఫ్రికన్ వైల్డ్ డాగ్ హంటింగ్ స్టోరీ
ఆఫ్రికా వైల్డ్ డాగ్స్‌కు ప్రసిద్ధి అని చెప్పవచ్చు. ఈ జంతువుకు ఎదురుగా కనిపించగానే మిగిలిన జంతువులకు ఒక రకమైన భయం మొదలవుతుంది. ఈ ప్రదేశం నుండి ఎలాగైనా బయట పడాలనే టెన్షన్ మొదలవుతుంది మిగిలిన జంతువులకు. వైల్డ్ డాగ్స్ ఒంటరిగా కనిపించడం అరుదు. ఇవి ఎక్కువ సమయం గుంపుగానే జీవిస్తుంటాయి. ఇవన్నీ కలిసి జంతువును వేటాడతాయి పంచుకుంటాయి. ఇవి తోడేలుకు, నక్కలకు సరిపోలిన బంధువులు. ఇవి సరాపరి 30 కేజీల నుంచి 50 కేజీల వరకు ఉంటాయి. ఇవి 80 సెంటీమీటర్ల ఎత్తు వరకు ఉండగలుగుతాయి. ఆఫ్రికా అడవుల్లో ఇవి ఎక్కడా కూడా ఒంటరిగా కనిపించవు. ఈ గుంపులో 30 వైల్డ్ డాగ్స్ ఉంటాయి. వీటిలో ఆల్ఫా మెయిల్, ఆల్ఫా ఫీమెయిల్ ఉంటాయి.
మిగిలిన వైల్డ్ డాగ్స్(African Wild Dog) అన్నీ పైన తెలిపిన ఆల్ఫా పిల్లలై ఉంటాయి. గ్రూపులో ఆల్ఫా మెయిల్, ఆల్ఫా ఫీమెయిల్ మాత్రమే సంతానం ఉత్పత్తి చేస్తాయి. మిగతా వాటి పని ఆ పిల్లల్ని సంరక్షించడం మాత్రమే. ఒక వేళ ఇలా ఇష్టం లేని వైల్డ్ డాగ్ గ్రూపు నుంచి బయటకు వెళ్లిపోవచ్చు. అది సొంతంగా ఒక గ్రూపును ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా వేరే గుంపులో కలవచ్చు. ఇలా ఒంటరిగా అయిన వైల్డ్ డాగ్స్ కొత్త కొంత గుంపులను ఏర్పరచుకుంటాయి. అందుకని ఆఫ్రికా అడవుల్లో ఈ వైల్డ్ డాగ్ గుంపులు కొక్కొల్లాలుగా కనిపిస్తాయి. వీటి యొక్క గుంపు తోడేలు ఐడియాలను ఫాలో అవుతుంటాయి. ఇవి గుంపులో చాలా క్రమశిక్షణగా ఉంటాయి. ఏ విషయంలోనైనా ఒకే అభిప్రాయంతో ఉంటాయి. ఒకటికొకటి చాలా గౌరవించుకుంటాయి వైల్డ్ డాగ్స్.
ఇతర జంతువుల ఆహారం ముట్టుకోవు
ఈ వైల్డ్ డాగ్స్ ఇతర జంతువును వేటాడేటప్పుడు చాలా చాకచక్యంగా ఉంటాయి. జంతువును వేటాడిన తర్వాత పోట్లాడుకుంటూ తినవు. గ్రూపులో ఉన్న వైల్డ్ డాగ్ గాయపడి ఉంటే దానికి ముందుకు ఆహారం తినేందుకు అవకాశం ఇస్తాయి. ఇవి అడవిలో చాలా ధైర్యంగా తిరుగుతాయి. ఇవి పగలు మాత్రమే ఎక్కువుగా వేటాడుతుంటాయి. వినికిడి శక్తి, వాసన చూడటం లాంటి పనుల్లో చాలా చురుగ్గా ఉంటాయి. ఇవి వేటాడిన సమయంలో ఒక్కొక్క వైల్డ్ డాగ్ 2 కేజీల నుంచి 8 కేజీల వరకు ఆహరంగా తింటాయి. మరొక్క విషయం ఏమిటంటే ఇవి ఇతర జంతువులు వేటాడిన మృతదేహాలను ఆహరంగా తినవు.
వాటంతటకవే వేటాడి మాత్రమే ఆహరంగా తింటాయి. కొన్ని సందర్భాల్లో ఈ వైల్డ్ డాగ్ గుంపు సింహం గానీ, చిరుత, పులి గానీ వేటాడే సమయంలో దాని వద్ద వేటాడి ఆ జంతువును లాక్కోవడంలో సఫలం అవుతాయి. ఈ అడవి కుక్కలు అన్ని జంతువులను ఆహారంగా తీసుకునేందుకు ప్రయత్నం చేస్తాయి. ఒక ఆఫ్రికన్ వైల్డ్ డాగ్ వేటాడే సమయంలో తన వేగం దాదాపు 60 కిలోమీటర్ల స్పీడ్ ను చేరుకోగలదు. ఈ వేగాన్ని అవి అలానే కొనసాగిస్తూనే ఉంటాయి.

వేటకు ముందే ప్లానింగ్ ఈ డాగ్ సొంతం!
ఇవి వేటాడే సమయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తాయి. ఎదుట జంతువుపై వేటాడే టప్పుడు ఆ జంతువు ఎలాంటితో ఎలా వేటాడాలో ముందే ప్లాన్ చేసుకుంటాయి. ఎక్కువుగా ఇవి జంతువును తన వేగంతో పరిగెత్తించి అలసిపోయేలా చేస్తాయి. ఒక వేళ ఇవి జంతువును వేటాడే టప్పుడు ఒక డాగ్ అలసిపోతే దాని వెనుక మరో వైల్డ్ డాగ్ వేటాడేందుకు రెడీగా ఉంటుంది. ఎదుట జంతువు పూర్తిగా అలసిపోయి దొరకిన తర్వాత ఈ వైల్డ్ డాగ్ గుంపు తమ ప్రతాపాన్ని చూపిస్తాయి. ఇవి వేటాడిన జంతువు బ్రతికి ఉన్నప్పుడే ఒక పక్క నుండి పీక్కొని తింటుంటాయి.
ఇవి జంతువును వెంటనే చంపలేవు. కారణం వైల్డ్ డాగ్ పళ్ళు చిన్నగా సన్నగా ఉంటాయి. కాబట్టి వేటాడిన జంతువును చంపేంత సమయం లేక బ్రతికి ఉండగానే తినేందుకు ఇష్టపడతాయి. ఇవి ఎంతటి పెద్ద జంతువుపైన అయినా వేటాడతాయి. దీని వేట గమనించిన జీబ్రా మాత్రం ఎదుర్కొనేందుకు ప్రయత్నం చేస్తాయి. ఇక ఆఫ్రికా అడవుల్లో వైల్డ్ డాగ్ కు సింహకు నిత్యం పోరాటం, శత్రత్వం కొనసాగుతూనే ఉంటాయి. ఈ వైల్డ్ డాగ్‌ను సింహం దాడి చేసి చంపుతుంది. ఈ కోపాన్ని దృష్టిలో ఉంచుకొని ఒంటరిగా ఉన్న సింహపు పిల్లలపై ఈ డాగ్స్ దాడి చేసి చంపుతాయి. కాబట్టి ఈ గుంపుకు, అడవికి రారాజు అయిన సింహకు నిత్యం యుద్ధం జరుగుతూనే ఉంటుంది.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ