African Swine Flu in Tripura | దేశంలోని కొత్త వైరస్ అయిన ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. త్రిపుర రాష్ట్రంలోని సెపాహిజాలా జిల్లాలో ఉన్న దేవీపూర్‌లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వెలుగు చూసింది. జంతు వనరుల అభివృద్ధి శాఖ నిర్వహిస్తున్న ఫామ్‌లో ఈ వైరస్ గుర్తించారు. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూను గుర్తించిన వెంటనే అప్రమత్తం అయిన నిపుణుల బృందం ఫామ్‌ను సందర్శించి పరిస్థితిని అంచనా వేస్తోంది. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఫామ్‌లోని పందులలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో అది ఫామ్ మొత్తం పాకి ఉంటుందనే భయం వ్యక్తమవుతోంది. ఇంకో వైపు ఆఫ్రికన్ స్వైన్ నిర్థారణ అయిన పందులన్నిం టినీ వేరు చేసి, చంపేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అయితే వీటిని 8 అడుగుల లోతైన గుంతలో పాతిపెట్టనున్నారు.
African Swine Flu in Tripura
గత రెండేళ్లుగా ప్రపంచంతో పాటు భారత్ కూడా కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతున్న దశలో ఇంకా ఇబ్బందులు పడుతున్న దశలో ఈ స్వైన్‌ఫ్లూ వైరస్ వార్త కలకలం రేపుతోంది. ఈ నెల 7వ తేదీన పందుల ఫామ్ నుంచి 3 శాంపిల్స్‌ను ఈశాన్య రాష్ట్రాల డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబోరేటరీకి పంపారు. ఏప్రిల్ 13న ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. పీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. పందుల ఫామ్‌లో ఈ లక్షణాలు బయటపడటంతో అంటువ్యాధి ప్రవేశించినట్టు సూచిస్తున్నాయి. భోపాల్ నేషనల్ డిసీజ్ డయాగ్నస్టిక్ ఇన్స్టిట్యూట్ నుంచి మరో నివేదిక అందాల్సి ఉందని త్రిపుర యానిమల్ హజ్బెండ్రీకి విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి అన్నారు. ఫామ్‌లో పనిచేసే వారిని కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసినట్టు తెలిపారు.
ఈ వ్యాధిని వ్యాప్తిని అరికట్టేందుకు పందులను చంపి పాతిపెడతారు. వైరస్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించకుండా ఫామ్, దాని పరిసర ప్రాంతాలకే పరిమితం చేయడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాయనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇటీవల మిజోరాంలోనూ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వెలుగులోకి వచ్చింది. పందుల్లో తీవ్ర మరణాలకు కారణమయ్యే ఈ వైరస్ మానవులకు వ్యాప్తి చెందే అవకాశం తక్కువే.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!