Afghanistan Women: తాలిబాన్లు ఆఫ్గానిస్తాన్‌లో వేసు ప్రతి అడుగూ ఇప్పుడు ఆ దేశ మహిళల్లో తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది. అఫ్గానిస్తాన్ లో మహిళల జీవితాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనని అంతర్జాతీయంగా కూడా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ నుంచి ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియా గుటెరస్ వరకు ఆ దేశంలో మహిళ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అఫ్గానిస్తాన్‌లో కొనసాగుతున్న ఘర్షణ, మానవ హక్కుల ఉల్లంఘన వార్తలతో ఆ దేశం నుంచి వేల మంది ప్రజలు, మహిళలు, పిల్లలు పారిపోతున్నారు.
ఉద్యోగం.. చదువుకు స్వేచ్ఛ ఉంటుందంటున్న తాలిబాన్
తాలిబన్ల పాలనలో మహిళల జీవితం గురించి ప్రపంచ వ్యాప్తంగా పలువురు నేతలు, నిపుణులు, ప్రముఖులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలపై తాలిబాన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ స్పందించారు. తమ ప్రభుత్వంలో మహిళలకు ఉద్యోగం చేయడానికి, చదువుకోవడానికి స్వేచ్ఛ ఉంటుందని ప్రకటించారు. తాలిబాన్ల పాలనలో మహిళలు న్యాయమూర్తులుగా ఉంటారా? అన్న ప్రశ్నకు మహిళలు వారికి సహకారం అందించే ఉద్యోగాలు చేయవచ్చు. ఈ విషయంపై భవిష్యత్ ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుందని తాలిబన్ ప్రతినిధి చెబుతున్నారు. విద్యా రంగం కోసం పనిచేస్తామని, ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రభుత్వానికి చాలా పని ఉంటుంది. కానీ మహిళలకు ఉద్యోగం చేసే, చదుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతున్నారు. దేశంలో ముఖ్యంగా యువత, బాలికలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మేము వారి గౌరవం, ఆస్తి, పని, చదుకునే హక్కులను కాపాడ్డానికి కట్టుబడి ఉన్నామని తాలిబాన్లు చెబుతున్నారు.
ఇది ఒక ఇస్లామిక్ ప్రభుత్వమని, కాబట్టి ఇక్కడ ఇస్లామిక్ చట్టాలు, రిలిజియస్ ఫోరం, కోర్టు నిర్ణయిస్తాయని తాలిబన్ తెలిపారు. బహిరంగ మరణదండన, స్టోనింగ్(రాళ్లతో కొట్టడం) చేతులు, కాళ్లు నరకడం లాంటి శిక్షలు విధించే చట్టాలపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
Afghanistan Women: తాలిబాన్లకు ఎదురైన ప్రశ్నలు ఇవే!
– ఇంతకు ముందులా మహిళలు ఇంటి నుంచి బయటికెళ్లాలంటే తండ్రి, భర్త, సోదరుడు.. ఇలా మగవారిని ఎవరినైనా తోడు తీసుకుని వెళ్లాల్సిన అవసరం కొత్త ప్రభుత్వంలో ఉంటుందా?
– ఇంతకు ముందు మహిళలు ఇంట్లో నుంచి ఒంటరిగా బయటకు వెళ్తే, పోలీసులతో కొట్టేంచేవారు. ఎంతో మంది మహిళలు తమ తండ్రి, సోదరుడు, భర్తతోనే ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించేవారు. మీరు ఇలానే చేస్తారా?
– తాలిబాన్ల పాలనలో మహిళలు న్యాయమూర్తి కాగలరా?
– జనం ఎక్కడ పనిచేయవచ్చు. ఎక్కడకు వెళ్లవచ్చు అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందా?
– 90వ దశకంలోని పరిస్థితి ఉంటుందా.. లేక పాలన కొత్తగా ఉంటుందా?
– తాలిబన్లు మళ్లీ రావడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న యువతులకు, బాలికలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి