Taliban: అఫ్గానిస్తాన్ దేశం అంతా తాలిబన్లు ఆధీనంలోకి వెళ్లిపోయింది. ప్రజలు దిక్కుతోచని స్థితి ఏం చేయాలో అర్థం కాక పరుగులు పెడుతున్నారు. దేశ రాజధాని కాబూల్లోనైనా తలదాచుకుందామ నుకుంటే అక్కడికి కూడా తాలిబన్లు ప్రవేశించారు. ప్రభుత్వ భవనాలన్నీ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆఫ్గానిస్తాన్ లో జరుగుతున్న పరిణామాలను చుట్టూ ఉన్న ముస్లిం దేశాలతో పాటు ప్రపంచ దేశాలు కూడా జాగ్రత్తగా గమనిస్తూ పరిశీలిస్తోన్నాయి. ఆఫ్గానిస్తాన్‌కు వచ్చిన ముప్పుపై కొన్ని దేశాలు మాట్లాడుతున్నప్పటికీ, మరికొన్ని దేశాలు మాత్రం మౌనం పాటిస్తున్నాయి.
ఇక ఆఫ్గానిస్తాన్‌లో ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితులపై ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇరు వర్గాలు ఇప్పటికైనా కూర్చొని మాట్లాడుకోండి..హింసను పక్కన పెట్టండి.. కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోండని చెబుతున్నా తాలిబన్లు వినేలా కనపించడం లేదు. ఇలా చెప్పిన ఓఐసీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండిపోయింది. ఇక ఆఫ్గానిస్తాన్ దేశ పరిస్థితిపై ముస్లీం దేశాలు ఒక్కొక్కటి ఒక్కో విధంగా స్పందిస్తున్నాయి.
ఆందోళనలో సరిహద్దు దేశాలు
ఆఫ్గానిస్తాన్‌కు పొరుగున ఉన్న ఇరాన్ బాగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశంలో ప్రస్తుత పరిస్థితులు అన్నీ తాలిబన్ల చేతిలోకి వెళ్లడంతో ఆఫ్గాన్ సైనికులు పొరుగున ఉన్న ఇరాన్ దేశానికి పారిపోయి ఆశ్రమం పొందుతున్నారు. కాబూల్, హెరాత్ లలోని ఇరాన్ దౌత్యవేత్తలు, సిబ్బంది ఉండటంతో వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని తాలిబన్లను ఆ దేశ ప్రభుత్వం అభ్యర్థించింది. అయితే 1998లో ఇదే విధంగా మజర్ – ఏ – షరీఫ్ నగరంలోని ఇరాన్ కు చెందిన ఒక జర్నలిస్టుతో పాటు ఎనిమిది మంది దౌత్యవేత్తలను తాలిబన్లు చంపారు. అప్పట్లో ఈ ఘటనపై ఇరాన్ కోపంతో ఊగిపోయి దాడి చేయాలని భావించింది. కానీ తర్వాత ఏకంగా తాలిబన్లు(Taliban), ఇరాన్‌ల మధ్య చర్చలు జరిగి ఇరువురి మధ్య శాంతి యుత సంబంధాలు మెరుగయ్యాయి.
ఉజ్జెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, తజికిస్తాన్ ఈ మూడు దేశాలు ఆఫ్గానిస్తాన్ సరిహద్దులు కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఆఫ్గాన్‌లో సంక్షోభ ప్రభావం ఈ మూడు దేశాలపైనే పడనుంది. ఎందుకంటే శరణార్థులు అందరూ ఈ దేశాలకే వలస వెళుతున్నారు. అయితే ఆఫ్గానిస్తాన్ లో కొద్ది నెలలుగా జరుగుతున్న యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని ఉజ్జెకిస్తాన్, తజికిస్తాన్ ఇటీవల సరిహద్దులను కట్టుదిట్టం చేశాయి. గత జూలై నెలలో కొందరు ఆఫ్గాన్ జవాన్లు ప్రాణాలను కాపాడుకోవడానికి ఉజ్జెకిస్తాన్ పారిపోయారు. మరోవైపు తజికిస్తాన్ కూడా సరిహద్దుల వెంబడి నిఘా పెంచింది. దాదాపు 20,000 వేల మంది సైనికుల్ని బోర్డర్ వద్ద అదనంగా మోహరింపజేసింది.
ఇక తుర్క్మెనిస్తాన్ మాత్రం తాలిబన్లతో బంధాలను బలపరుచుకునే పనిలో ఉంది. చర్చల కోసం తాలిబన్ నాయకులను ఇప్పటికే తుర్క్మెనిస్తాన్ కు ఆహ్వానం పలికింది. ఆఫ్గాన్ సంక్షోభంపై సరిహద్దు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో పొరుగు దేశాలకు తమ వల్ల ఎలాంటి ముప్పూ ఉండబోదని తాలిబన్లు ఇప్పటికే స్పష్టం చేశారు. పొరుగున ఉన్న దేశాలను ఆక్రమించే ఉద్దేశం తమకు ఇప్పటిలో లేదని చెబుతున్నారు. తాలిబన్ల మాటలను నమ్మని ఉజ్జెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, తజికిస్తాన్ లు మాత్రం ఎప్పుడు మావైపు దూసుకొస్తారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఆఫ్గాన్ నుంచి అమెరికా సేనలు ఉపసంహరించుకుంటున్నామని ప్రకటన వెలువడిన నేపథ్యంలో టర్కీ ప్రభుత్వం స్పందించింది. కాబూల్ నగరంలో హమిద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాము ఆధీనంలోకి తీసుకుంటామని టర్కీ ప్రకటించింది. ఈ వార్త విన్న తాలిబన్లు టర్కీ నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు. బలగాలను విమానాశ్రయానికి పంపితే మాత్రం ఊరుకునేది లేదని టర్కీకి హెచ్చరికలు జారీ చేశారు. మేము ఉండగా ఆఫ్గానిస్తాన్‌లో ఏ విదేశీ జోక్యం అవసరం లేదని వ్యాఖ్యానించారు.
పాక్‌తో మంచి సంబంధాలు ఉన్నాయంటున్న తాలిబాన్
ఆఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ స్పందించింది. పాకిస్తాన్లో దాదాపు ఇప్పటికే 30 లక్షల మంది ఆప్గాన్ శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు. రెండు దేశాల మధ్య 2500 కి.మీ పొడవైన సరిహద్దులు ఉన్నాయి. అయితే తాలిబన్లతో పాకిస్తాన్‌కు దగ్గర సంబంధాలు ఉన్నాయనే విషయం బయటకు వచ్చింది. మరోవైపు తమపై పాక్ ప్రభావం ఉండబోదన్న వాదనలను తాలిబాన్లు ఖండిస్తున్నారు. పాకిస్థాన్ తమకి మంచి మిత్రదేశంగా ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆఫ్గాన్ నుంచి తాము ఎలాంటి ప్రయోజనాలను ఆశించడం లేదని చెప్పారు. అయితే తాలిబాన్లను పాకిస్తాన్ ప్రభుత్వమే తమదేశం మీదకు ప్రోత్సహించిందని ఆఫ్గాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.


ఇక ప్రపంచంలోనే అతిపెద్ద సున్నీ ముస్లీంల దేశం సౌదీ అరేబియానే. అయితే ఆఫ్గాన్ సంకోభంపై సౌదీ మౌనం పాటిస్తోంది. ఇటు ఆఫ్గాన్, అటు పాక్ రెండు దేశాలతో సౌదీకి మంచి సంబంధాలు ఉన్నాయి. మరోవైపు తాలిబన్లతోనూ సౌదీకి సంబంధాలున్నాయి. 2018 సంవత్సరంలో ఖతర్‌లో అమెరికా, తాలిబాన్ల మధ్య చర్చలు మొదలైన నాటి నుంచి నేటి వరకూ సౌదీ వ్యూహాత్మక దూరం పాటిస్తోంది. 1980-90 కాలంలో రష్యాకు వ్యతిరేకంగా ఆఫ్గాన్‌లోని ముజాహిదీన్లను సౌదీ ప్రోత్సహించింది. కానీ ప్రస్తుత సంకోభంలో మాత్రం ప్రత్యక్షంగా ఎలాంటి జోక్యమూ చేసుకోవడం లేదు.
- MLA Seethakka: తెలంగాణలో నీళ్లేవూ..నిధులూ లేవూ!
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!