Aerobics Dance Exercise | వయసు పెరిగే కొద్దీ దిగులు మనిషిని మరింత పెద్ద వయసు వారిలా కనిపించేలా చేస్తుంది. వయసుతో పాటు వచ్చే అనారోగ్య సమస్యలను, ముఖంపై వచ్చే ముడతలను తగ్గించి మీ వయసు పదేళ్లు తక్కవుగా కనిపించా లంటే ఒకటే మార్గం ఎరోబిక్స్(Aerobics). శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ ను అందించే ఎరోబిక్స్ చేయడం వల్ల మీరు చెప్పే అవసరం లేకుండా మీ వయసు పదేళ్లు తగ్గుతుందని అంటున్నారు పరిశోధకులు. క్రమం తప్పకుండా తేలిక పాటి వ్యాయామాలు చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం(health), అందానికి అందం.
Aerobics Dance Exercise | ఏరోబిక్స్ డ్యాన్స్ వల్ల ప్రయోజనాలు!
ఏరోబిక్స్ ఎక్సర్ సైజులు చేయాలంటే జిమ్‌కు వెళ్లాలనుకుంటారు కొందరు. అది తప్పు. ఏరోబిక్స్‌ను చాలా రకాలుగా చేయవచ్చు. వాకింగ్, జాగింగ్, స్లో రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్,తేలికపాటి ఆటలు, డ్యాన్స్(dance) వంటివి కూడా ఈ జాబితాలోకే వస్తాయి. క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఎరోబిక్స్ చేయడం ద్వారా ఊపిరితిత్తులకు అందే ఆక్సిజన్(oxygen) శాతం పెరుగుతుంది. గుండె రక్తనాళాలు మరింత సమర్థవంతంగా పని చేస్తాయి.
రోజూ కనీసం అరగంట తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని కొన్ని భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు నిల్వలు కరిగిపోయి స్లిమ్‌గా అవుతారు. అప్పుడు మీరు చెబితే తప్ప మీ వయసు తెలియదు. ఒత్తిడి వల్ల వచ్చే గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రాకుండా నివారించవచ్చు. 40 ఏళ్ల తర్వాత మహిళల్లో వచ్చే ఆర్ధరైటిస్ ఈ తేలికపాటి వ్యాయామాలతో తగ్గుతుంది. ఎముకల్లో సాంద్రత, పటుత్వం పెరుగుతుంది. కీళ్ల కదలికలు మెరుగవుతాయి.
ప్రారంభ దశలో శరీరం ఎక్కువగా అలసటకు లోనయ్యేటట్టు విపరీతంగా వ్యాయామం చేయకూడదు. పది నుంచి పదిహేను నిమిషాల సేపు వ్యాయామం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలి. వ్యాయమానికి ఉదయమే మంచి సమయం. విటమిన్ డి కూడా శరీరానికి అందుతుంది. మొదట మూడు నుంచి నాలుగు వారాల పాటు రోజూ చేయాలి. ఆ తర్వాత వారానికి కనీసం ఐదు రోజులు వ్యాయామం చేయాలి.
ఎరోబిక్స్ చేయడం వల్ల ఫలితాలు వెంటనే కనిపించవు. ఈ వ్యాయామాల ద్వారా లభించే ప్రయోజనాలను పొందాలంటే తప్పనిసరిగా వారానికి ఐదు రోజులు సంవత్సరం పాటు చేయాలి. అప్పుడే శరీరం మీరు కోరుకున్న ఆకృతిలోకి వస్తుంది. ఎరోబిక్స్ వ్యాయామం చేయడం ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.