aerobic exercise benefitsవయసు పెరిగే కొద్దీ దిగులు మనిషిని మరింత పెద్ద వయసు వారిలా కనిపించేలా చేస్తుంది. వయసుతో పాటు వచ్చే అనారోగ్య సమస్యలను, ముఖంపై వచ్చే ముడతలను తగ్గించి మీ వయసు పదేళ్లు తక్కువుగా కనిపించాలంటే ఒకటే మార్గం అది ఎరోబిక్స్. శరీరంలోని ప్రతి కణానికి Oxigenను అందించే ఎరోబిక్స్ చేయడం వల్ల మీరు చెప్పే అవసరం లేకుండానే మీ వయసు పదేళ్లు తగ్గుతుంది అంటున్నారు పరిశోధకులు. క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామాలు చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం, మరి ప్రయత్నించండి.


ఏరోబిక్స్ ఎక్సర్సైజులను చేయాలంటే జిమ్‌కు వెళ్లాలనుకుంటారు చాలా మంది. అది తప్పు. ఏరోబిక్స్(aerobic exercise benefits)ను చాలా రకాలుగా చేయవచ్చు. walking, jogging, slow running, cycling, swimming, తేలికపాటి ఆటలు, డ్యాన్స్ వంటివి కూడా ఈ జాబితాలోకి వస్తాయి. క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలనిస్తాయి.
ఏరోబిక్స్ చేయడం ద్వారా ఊపిరితిత్తులకు అందే ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. గుండె, రక్తనాళాలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. రోజూ కనీసం అరగంట తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని కొన్ని భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు నిల్వలు కరిగిపోయి స్లిమ్ (slim)గా అవుతారు.అప్పుడు మీరు చెబితే తప్ప మీ వయసు తెలియదు.


ఒత్తిడి వల్ల వచ్చే గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రాకుండా నివారించవచ్చు. నలభై ఏళ్ల తరువాత మహిళల్లో వచ్చే ఆర్థరైటిస్ ఈ తేలికపాటి వ్యాయామాలతో తగ్గుతుంది. ఎముకల్లో సాంద్రత, పట్టుత్వం పెరుగుతుంది. కీళ్ల కదలికలు మెరుగువుతాయి.
ప్రారంభదశలో శరీరం ఎక్కువుగా అలసటకు లోనయ్యేటట్టు విపరీతంగా వ్యాయం చేయకూడదు. 10 నుంచి 15 నిమిషాల సేపు వ్యాయామం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలి. వ్యాయామానికి ఉదయమే మంచి సమయం. Vitamin D కూడా శరీరానికి అందుతుంది. మొదటి మూడు నుంచి నాలుగు వారాల పాటు రోజూ చేయాలి. ఆ తర్వాత వారానికి కనీసం ఐదు రోజులు వ్యాయామం చేయాలి.


ఎరోబిక్స్ చేయడం వల్ల ఫలితాలు వెంటనే కనిపించవు. ఈ వ్యాయామాల ద్వారా లభించే ప్రయోజనాలను పొందాలంటే తప్పనిసరిగా వారానికి ఐదు రోజులు సంవత్సరం పాటు చేయాలి. అప్పుడే శరీరం మీరు కోరుకున్న ఆకృతిలోకి వస్తుంది. ఎరోబిక్స్ వ్యాయామం చేయడం ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!