adult vaccination india సాధారణంగా టీకాలు చిన్న పిల్లలకే వేస్తారనుకుంటాం. కానీ పెద్దవాళ్లకూ టీకాలుంటాయి. అది ప్రస్తుత కాలంలో కరోనా మహమ్మారి వల్ల తెలిసింది. అందరూ టీకాలు ఒకటి, రెండు డోసులు వేయించు కుంటున్నారు. అయితే గతంలో పెద్ద వారికి టీకాలు ఉండేవట. కానీ వాటిపై అంతగా అవగాహన లేక ఎక్కువ సంఖ్యలో వాటిని వేసుకోలేకపోయారు. టెట్నస్ (ధనుర్వాతం), న్యుమోనియా, ఫ్లూ, హెపటైటిస్, సర్వైకల్ కాన్సర్, జోస్టర్‌లకూ, టీకాలని పెద్దవాళ్లకూ వేస్తారు. 16-25 మధ్య వయస్సు గల వాళ్లకు కొన్ని ప్రత్యేక టీకాలున్నాయి. 50 సంవత్సరాలు పైబడిన వాళ్లకీ (adult vaccination india)టీకాలున్నాయి.


ధనుర్వాతానికి టీకా: ధనుర్వాతం రాకుండా టెట్నస్(tetanus) టీకాలు వేస్తారు. టెట్నస్లో క్రింది దవడ పట్టుకుపోతుంది. క్లోస్ప్రిడియం టెటానీ అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడంతో ధనుర్వాతం వస్తుంది. ఇది గాయం ద్వారా టెటెనోస్పాస్మిన్ అనే విష పదార్థాన్ని శరీరంలోకి ఉత్పత్తి చేయడం ద్వారా టెట్నస్ వస్తుంది. ఈ విషం నరాల వ్యవస్థని దెబ్బతీస్తుంది. దీంతో నరాల నుంచి వెన్ను నుంచి పైమెదడుకి సిగ్నల్స్ అందవు. ప్రతి 10 సంవత్సరాలకి వ్యాక్సిన్న్ చేసి ఇది రాకుండా కాపాడుకోవచ్చు.
న్యూమొకోకల్ వ్యాక్సిన్(pneumococcal vaccine): పిసిబి 13 అనే వ్యాక్సిన్‌ని 5 సంవత్సరాలలోపు వాళ్లకి, 19 సంవత్సరాల పైబడిన వాళ్ళకి లక్షణాలను బట్టి తప్పకుండా చేయాలి. 65 సంవత్సరాలు, అంతకుపైబడిన వాళ్ల కోసం పిపివిఎస్వి 23 వ్యాక్సిన్‌ని వేయించాలి. సికిల్ సెల్ డిసీజ్, హెచ్ఐవి, కాన్సర్‌తో బాధపడేవాళ్లకి, సిగరేట్లు ఎక్కువుగా తాగేవాళ్లకి, ఆస్త్మా, డయాబెటిస్, క్రానిక్ లంగ్- కిడ్నీ వ్యాధులు ఉన్నవాళ్లకి రిస్క్ ఎక్కువ కాబట్టి ఈ వ్యాక్సిన్ వేయించాలి.


ఫ్లూవ్యాక్సిన్ (flu vaccines): కొన్ని సీజన్లలో ఫ్లూ ఎక్కువుగా వస్తుంటుంది. అప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ ని చేయించడం అవసరం. ఈ వ్యాక్సిన్‌తో పాటు యాంటీ బయాటిక్స్ వాడాల్సి వస్తుంది. ఎక్కువ విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది.
హెపటైటిస్(జాండిస్)(hepatitis) : హెపటైటిస్ ఎ,బి,సి.డి అని వేరు అయినప్పటికీ, వ్యాధి ఒక్కటే!. లివర్ ఇన్ఫ్లమేషన్తో జాండీస్‌తో హెపటైటిస్ని గుర్తించవచ్చు. హెపటైటిస్ సి, డి,ఈలకి వ్యాక్సిన్ లేనప్పటికీ, ఎ,బి లు రాకుండా వ్యాక్సిన్ ఉంది.
గర్భాశయ క్యాన్సర్: హ్యూమన్ ప్యాపిలోమా వైరస్(human papillomavirus)తో గర్భాశయ క్యాన్సర్లు వస్తుంటాయి. మగవాళ్లకి వార్ట్స్ వస్తుంటాయి. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్‌తో వీటిని అరికట్టవచ్చు. హెచ్పివి వ్యాక్సిన్ కాన్యర్లో కూడా ఉపయోగపడుతుంది.
జ్యోష్టర్ వ్యాక్సిన్(zoster vaccine): హెర్పిస్ తగ్గడానికి ఈ వ్యాక్సిన్‌ని వాడతారు. పోస్టర్ పెటిక్ న్యూరాజియా తీవ్రతని, నొప్పిని, అసౌకర్యాన్ని తగ్గించడానికి, జ్యోష్టర్ వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది.


వ్యారిసెల్లా వ్యాక్సిన్(varicella vaccine): చికెన్‌పాక్స్ రాకుండా ఇది తోడ్పడుతుంది. రుబెల్లా వ్యాక్సిన్ – మీజిల్స్ – మమ్స్కి 2005 నుంచి ఇది లభ్యమవుతోంది. పొంగు, తట్టులాంటి వాటి నుంచి కాపడటానికి ఈ వ్యాక్సిన్ తోడ్పడుతుంది.
మెనింజోకోకిల్ వ్యాక్సిన్ (బ్రెయిన్ ఫీవర్)brain fever: మెనింజైటిస్, మెనిరిగో, కోక్సేమియా, సెప్టీసీమియా, నెఫ్టిక్, అర్ధరైటిస్, నిమోనియా లాంటివి తగ్గించడానికి ఈ వ్యాక్సిన్ తోడ్పడుతుంది.
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!