adobe page maker free download పేజీ మేకర్ గురించి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? అసలు పేజీ మేకర్ గురించి ఏమీ తెలియదా? మీకు కంప్యూటర్ లేదా లాప్టాప్ ఏదైనా ఉన్నదా? అయితే బయట computer institutesకు వెళుతున్నారా? వెళ్లినా ఏమీ అర్థం కావడం లేదా? అయితే మీ ఫోనోలో కానీ, కంప్యూటర్లో కానీ youtube ఆన్ చేసి ‘Pagemaker full course in Teluguస అని టైపు చేయండి. ఇక వరుసగా యూట్యూబ్ వీడియోలు వస్తాయి. వేలకు వేలు ఖర్చు పెట్టి ఏదైనా నేర్చుకోవాలను కునే కన్నా ఫోన్లో ఉన్న ఇంటర్ నెట్ ద్వారా ఎన్నో కోర్సులను యూట్యూబ్‌లో నేర్చుకోవచ్చు. మీకు పేజీ మేకర్ కోర్సులు నేర్పి కొన్ని యూట్యూబ్ channel గురించి వివరిస్తాము. మీకు నచ్చిన వారి ఛానల్లో మీకు అర్థమయ్యే విధంగా ఉంటే నేర్చుకోండి. నెలరోజుల్లో మీకు పేజీ మేకర్ ఎలా వాడాలి? అనేది వస్తుంది.adobe page maker free download
Computer Adda యూట్యూబ్ ఛానల్లో పేజీ మేకర్ వీడియో మొత్తం ఫుల్ కోర్సు అందిస్తున్నారు. ఇందులో పేజీ మేకర్ ఎలా వాడాలి అనేది స్టాటింగ్ నుంచి చివరి వరకు తెలుగులో అందిస్తున్నారు. ఇది నిడివి 3.22.56 నిమిషాలు ఉన్నది. మీరు ఈ వీడియో రోజు కొద్దిగా చూసి అయినా పేజీ మేకర్ నేర్చుకోవచ్చు.
direct link: Computer Adda


Edusoft Learning Systems-learning simplified యూట్యూబ్ ఛానల్లో కూడా పేజీ మేకర్ గురించి వీడియో ఫుల్ కోర్సు అందిస్తున్నారు. పేజీమేకర్‌లో ఫొటోను ఎలా తీసుకోవాలి. దాని సైజు ఎలా తగ్గించాలి. ఎలా సెట్ చేసుకోవాలి. పిక్చర్ పక్కన కంటెంట్ ఎలా పెట్టాలి? లాంటి కోర్సులను అందిస్తున్నారు. ఈ వీడియో కూడా 4.22.15 గంటల నిడివి ఉన్నది. మొత్తం ఫుల్ కోర్సు అందిస్తున్నారు.
direct link: Edusoft Learning Systems-learning simplified
Learn Computer Telugu channel యూట్యూబ్ ఛానల్లో మోహన్ అనే వ్యక్తి పేజీ మేకర్ గురించి విపులంగా చెప్పారు. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకోవాలనేది కూడా పూర్తిగా వివరించారు. ఈ చానెల్ కింద decryption పేజీ మేకర్ సాప్ట్వేర్ కూడా లింక్ అందించారు. మీ వద్ద పేజీ మేకర్ లేకపోతే దానిని డౌన్లోడు చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని వాడేయవచ్చు. మేము ఇచ్చే లింక్ ద్వారా మీరు ఆ వీడియో కింద సాప్ట్ వేర్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.


direct link: Learn Computer Telugu channel
Telugu Multimedia Tutorials యూట్యూబ్ ఛానల్ కూడా చాలా ఫేమస్ చానల్. మీరు ఈ ఛానల్లో అనేక రకాల సాప్ట్ వేర్లు గురించి నేర్చుకోవచ్చు. పేజీ మేకర్ అసలు ఎలా పుట్టింది. దాని చరిత్ర ఏమిటి? అసలు పేజీ మేకర్ ఎందుకు, ఎలా ఉపయోగిస్తారు? అనేది పూర్తి వివరాలతో వీడియలో కోర్సు అందజేశారు. ఈ ఛానల్ కింద డిస్కిర్షన్లో కూడా పేజీ మేకర్ సాప్ట్వేర్ డౌన్లోడ్ లింక్ అందజేశారు.
direct link: Telugu Multimedia Tutorials
పైన తెలిపిన యూట్యూబ్ ఛానల్లే కాకుండా మరికొన్ని ఛానళ్లు పేజీ మేకర్ గురించి తెలుగులో వివరిస్తున్నాయి. వాటిని కూడా మీరు ఒక్కసారి చూసి పేజీ మేకర్‌ను ఎవరి సహాయం లేకుండానే మీరు స్వంతంగా నేర్చుకోవచ్చు. నేర్చుకోవడమే కాదు ప్రతిరోజూ ప్రాక్టీసు కూడా చేస్తే పేజీ మేకర్ ఎప్పటికైనా మీకు గుర్తుండి పోతుంది.