Adivasi Homes | అరణ్యాలలో దొరికే ఆకులు, అలములతో పాటు వేటాడిన జంతు మాంసాన్ని తింటూ దుర్భర జీవితాన్ని గడిపిన ఆదివాసీలు క్రమంగా తమదైన ఆచార సాంప్రదాయాలతో తమ తమ సంస్కృ తులను అభివృద్ధి చేసుకున్నారు. అటువంటి Savara సంస్కృతి విశేషాలు తెలుసుకోవడం ఆసక్తి దాయకం అని చెప్పవచ్చు.
సవరలు ఇల్లు (Adivasi Homes) కట్టుకునే స్థలంలో నాలుగైదు చోట్ల నేలమీద మాతర ఆకులను ఉంచి వాటిమీద బియ్యపు గింజల్ని వేసి మరలా మాతరాకులు కప్పుతారు. మరుసటి రోజు వచ్చి చూస్తే ఆ ఆకుల్లో బియ్యం గింజలు ఉంటే ఆ నేల మంచిదని, బియ్యం గింజలు లేకపోతే ఆ నేల గుల్ల నేల అని ఇల్లుకట్టుకోవడానికి మంచిది కాదని వీరు నమ్ముతారు. కొంగవాగుల్లో నిత్యం ప్రవహించే ఊటగడ్డలకు చేరువలో చదునైన ప్రదేశాల్లో ఇల్లు కట్టుకుంటారు. సవరలు నిర్మించుకునే ఇండ్లు చాలా చిన్నవి. ఇవి 12 అడుగుల పొడవు, ఆరడుగుల వెడల్పు ఉండేలా చూస్తారు. ఇంటి వెన్ను ఎన్నిమిది అడుగులు ఎత్తు మాత్రమే ఉంటుంది.
వెనుక గోడలు అరడుగుల ఎత్తు ఉంటాయి. ముందు చూరులు భూమికి నాలుగడుగుల ఎత్తు ఉంటాయి. వీధి గుమ్మం గోడకు కుడిపక్కన ఉండే ఏర్పాటు చేసుకుంటారు. పెరటి గుమ్మ కోసం ఇండ్లకు వీధి గుమ్మానికి ఎదురుగానే ఉంటుంది. వీధివైపు అరుగు, ఆ అరుగు కింద కోళ్ల గూడు ఉండటం ఆనవాయితీ. వీధి గుమ్మానికి ఎదురుగా ఉండే గోడకు కుడివైపు ఇంట్లో ఒక తిన్నెను అమర్చుకుంటారు. దానిపై నీళ్ల కుండలు పెట్టుకుంటారు. పెరటి Wallకు చేరువగా పొయ్యి ఉంటుంది. ఆ పొయ్యిలోని నిప్పు సంవత్సరం పాటు ఉంటుంది. ఏడాదికోసారి అంటే ఫాల్గుణ పౌర్ణమి నాడు ఆ పొయ్యిలోని నిప్పును పూర్తిగా తీసివేసి పొయ్యిని శుభ్రంగా అలికి, కొత్తగా నిప్పును వేస్తారు.
Adivasi Homes: గృహం లోపలి భాగం ఇలా!
సవరలు(Savara) మట్టి రాళ్లు పేర్చి గోడలు తయారు చేస్తారు. ఇంటి కప్పుకు ఆధారంగా నిట్రాటలు, గుగ్గిలం, చెట్టు దూలాలు ఉంటాయి. వాటిమీద వెదురు దుబ్బలు పేర్చి కప్పును తయారు చేసి దానిమీద దబ్బగడ్డి వేస్తారు. పొయ్యి ఉన్న చోటకు పైన ఇంట్లో ఎడమవైపున నాలుగు అడుగుల ఎత్తులో ఒక చిన్న అటక ఉంటుంది. అటక మీద ధాన్యం కుండలు, గంపలు దాచుకుంటారు. ఆ అటకకు పొయ్యికి మద్యగా మరో చిన్న అటక ఉంటుంది. ఆ రోజున వండుకునే ఆహార పదార్థాలను ఆ చిన్న అటక మీద ఉంచుకుంటారు.


Adivasi Homes: పనిముట్లు ఇవే!
బట్టలు దాచుకోవడానికి అల్లిక పెట్టెను వాడతారు. ఇవిగాక ఇంట్లో వీరు వాడే పనిముట్లు కంకి, గొడ్డలి, కత్తి, కొడవలి, బాణాలు, ఇవికాక వాయిద్య విశేషాలు కూడా ఉంటాయి. చెట్టు కర్రలతోను, వెదురు బొంగులతోను, చేసుకున్న మంచాలకు నులక తాడు అల్లుకుంటారు. మంచాలు పొట్టిగా చేసుకోవడం అలవాటు. ఇల్లు అందంగా కట్టుకున్నా మంచి పట్టె మంచాలు వేయించుకున్నా, ఇంటికి తెల్లని సున్నాలు వేయించుకొన్నా ఎవరైనా ఓర్వలేక సిల్లింగులు పెట్టి చంపేస్తారని వీరి భయం.