Adadhanine nenu women’s day song | ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ సింగర్ మధుప్రియ ఒక మంచి (Madupriyaపాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆడదానినే నేను…అంటూ ఆడపిల్లలు, మహిళల కష్టాలపై పాడిన పాట అద్భుతంగా ఉంది. ఆడదానినే నేను 9 నెలలు పోసినాను..అంటూ కన్నీటితో మధుప్రియ పాడిన పాట మహిళలు పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్టు చూపించారు.
సింగర్ మధు ప్రియ తన కెరీర్లో ఇలాంటి ఆడపిల్లల బాధలపైన పాడిన ఆడపిల్లనమ్మా నేను..ఆడపిల్లనని అంటూ చిన్న తనంలోనే పాడిన పాట యావత్తు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి మధుప్రియ తన కెరీర్ను ప్రారంభించి ఎన్నో అద్భుతమైన పాటలను తెలుగు ప్రజలకు అందించారు. అదే విధంగా తెలంగాణ జానపద కళాకారుల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా ఆడదానినే నేను..అంటూ పాడిన పాటను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదల చేశారు. అందులో మధుప్రియ యాక్టింగ్ కూడా చేశారు. ఒక బాబును చక్కన పెట్టుకొని పాటలో ఎంట్రీ ఇచ్చారు. ఈ పాటలో ఆడపిల్లను ఎలా హింసిస్తున్నారో, మానసికంగా ఎలా ఇబ్బందులకు గురిచేస్తున్నారో, చిన్న పిల్లలకు ఎలా మాయమాటలు చెప్పి చెరపాలనుకుంటున్నారో..వాటిన్నింటిని తన పాట రూపంలో వీడియో సన్నివేశాలను చూపిస్తూ పాడింది మధుప్రియ.
ఈ పాట విన్న అభిమానులు, ప్రేక్షకులు సింగర్ మధు ప్రియకు అభినందనలు తెలియజేస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మంచి పాటను అందించినందుకు సాటి మహిళలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆడపిల్లను గౌరవించకుండా అవమానిస్తున్న ఈ లోకంలో కొందరికి ఈ పాట చెప్పు దెబ్బగా చెప్పవచ్చు. 9 నెలలు మోసి మనకు జన్మనిచ్చిన తల్లి ఆడదేనని..అలాగే ప్రతిఒక్క మహిళలో అమ్మనో..చెల్లినో చూసి ఆదుకోవాలి తప్ప అభాసుపాలు చేయకూడదని మొత్తంగా సింగర్ మధుప్రియ పాడిన పాట సారాంశంగా చెప్పవచ్చు.
Adadhanine nenu women’s day song
Singer, Actor & Producer: Madhuppriya
Directed by: Krish
Lyrics: Dilip Devgan
Music: Naveen. J
DOP: Sudhakar SDK
Editing &DI: Saiteja Kundharapu
Kashifkreations Manager: PavanKumar Mekala
Rhythms: Chiru
Voilen: Sandiliya
Special thanks to: Chekka ramesh (hyderpur)
Powered by: Kashifkreations
ఈ పాట వీడియో కోసం లింక్ క్లిక్ చేయండి!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ