active income vs passive income

active income vs passive income:మ‌న‌కు ఆదాయం వ‌చ్చే మార్గాల్లో ఇవి రెండూ కీల‌కం!

Bank Impramation
Share link

active income vs passive income: పాసివ్, యాక్టివ్ ఇన్‌కం అంటే ఏమిటి? అనే దాని గురించి క్రింద వివ‌రంగా ఎక్స‌ప్లెయిన్ చేయ‌డం జ‌రిగింది. పాసివ్ ఇన్‌కం వారు ఎక్కువ సంపాదిస్తున్నారా? యాక్టివ్ ఇన్‌కం వారు ఎక్కువ సంపాదిస్తున్నారా? తేడా తెలుస్తుంది. ఈ రెండింటికీ(active income vs passive income) మ‌ధ్య ఉన్న తేడా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం!.

active income

యాక్టివ్ ఇన్‌కం అంటే ఆక్టివ్‌గా ప‌ని చేయ‌డం వ‌ల్ల వ‌చ్చే ఆదాయం. మ‌నం సాధార‌ణంగా చేసే ఉద్యోగాల‌నే దీనికి ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు. డాక్ట‌ర్లు, లాయ‌ర్లు లాంటి వృత్తి నిపుణులు కూడా ఆక్టివ్ ఇన్క‌మ్ ద్వారానే సంపాదిస్తుంటారు. మ‌న‌కు బాగా ప‌రిచిత‌మైన కిరాణా, కూర‌గాయ‌లు, టీ స్టాళ్లు, పాన్ షాపులు, హోట‌ళ్లు అన్నీ ఆక్టివ్ ఇన్క‌మ్(active income) కింద‌కే వ‌స్తాయి.

ఇక్క‌డ ప‌నిచేస్తేనే ఆదాయం. ఒక్క రోజు ప‌ని చేయ‌క‌పోయినా ఆదాయ‌ముండ‌దు. అంటే Time=Money అన్న‌మాట‌. మ‌నం స‌మ‌యాన్ని కేటాయిస్తూ, ప్ర‌త్య‌క్షంగా ప‌నిచేస్తేనే మ‌న‌కు జీతం లేదా ఆదాయం ల‌భిస్తుంది. ఖ‌ర్మ కాలి, ఉద్యోగం ఊడితే, ఆ క్ష‌ణం నుండి ఆదాయ‌నికి ఫుల్ స్టాప్ ప‌డ్డ‌ట్టే మ‌ళ్లీ వేరే ఉద్యోగం వ‌చ్చేంత వ‌ర‌కు అలానే ఉండాలి.ఉద్యోగం చేస్తూ ఉన్నా, క‌రోనా లాక్ డౌన్ లాంటి విపత్తులు వ‌చ్చి కొన్ని రోజులు మ‌నం ఆఫీసో, ఫ్యాక్ట‌రియో న‌డ‌వ‌క పోయినా మ‌న‌కు ఆదాయం ఆగినట్టే.

active income vs passive income

ఈ ర‌క‌మైన ఆదాయం లిమిటెడ్‌గా ఉంటుంది. అంటే ఈ నెల ఎంత ఆదాయం వ‌స్తుందో, వ‌చ్చే నెల కూడా అంతే ఆదాయం వ‌స్తుంది. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన ఇంకో విష‌యం ఏమిటంటే వీరికి అద‌నంగా స‌మ‌యం (Extra Time) అనేది దొర‌క‌దు. కొత్త‌గా ఏమీ నేర్చుకోలేరు. ఈ ర‌కంగా సంపాదిస్తూ ధ‌న‌వంతులు కావ‌డం చాలా క‌ష్టం. ఇంకా అసంభ‌మ‌నే చెప్పాలి.(ష‌రుతులు వ‌ర్తిస్తాయి).

passive income

ఒక వ్య‌క్తి ప్ర‌త్యేక్షంగా ప‌ని చేయ‌క‌పోయినా వ‌చ్చే ఆదాయాన్ని పాసివ్ ఇన్‌కం అంటారు. ఉదార‌హ‌ర‌ణ‌కు ఇంటి కిరాయిలు, బ్యాంకు డిపాజిట్లు మీద వ‌స్తున్న వ‌డ్డీలు, షేర్ల ద్వారా వ‌స్తున్న డివిడెంట్లు లాంటివి. ఇవి మ‌నం ఏ ప‌ని చేయ‌క‌పోయినా రెగ్యుల‌ర్‌గా వ‌స్తూ ఉంటాయి. ఇందులో ప‌ని త‌క్కువ‌, లేదా అస‌లు ప‌ని చేయాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌క పోవ‌చ్చు. ఒక్క‌సారి చేసిన ప‌నికి ప్ర‌తిఫ‌లం మ‌ళ్లీ మ‌ళ్లీ వస్తూ ఉంటుంది.

ఇక్క‌డ ఎంత పెద్ద ల‌క్ష్యాల‌నైనా సాధించే అవ‌కాశం ఉంటుంది. ఇక్క‌డ మ‌న‌కు కావాల్సినంత ఖాళీ స‌మ‌యం దొర‌కుతుంది. కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకునే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉంటాయి. Scalability ఉండ‌టం మూలంగా ధ‌న‌వంతులవ్వ‌డం చాలా తేలిక‌. చ‌ట్ట బ‌ద్ధ‌మైన‌, న్యాయ బ‌ద్ధ‌మైన పాసివ్ ఇన్‌కం లేకుండా కోటీశ్వ‌రుడు అయినా వారు చ‌రిత్ర‌లో దాదాపుగా ఉండ‌రు. ఆ మాట కొస్తే చ‌ట్ట విరుద్ధంగా, అక్ర‌మంగా సంపాదించే సొమ్ము కూడా ఒక ర‌కంగా పాసివ్ ఇన్క‌మ్ (passive income) అనే చెప్ప‌వ‌చ్చు. అయితే దీని నుండి తీవ్ర ప‌రిణామాలు కూడా ఉంటాయి.

లాభాల ద్వారా వ‌చ్చే ఆదాయం(Profit Income), వ‌డ్డీ ద్వారా వ‌చ్చే ఆదాయం(Interest Income), డివిడెండ్ల ద్వారా వ‌చ్చే ఆదాయం(Dividend Income), అద్దెల ద్వారా వ‌చ్చే ఆదాయం(Rental Income), క్యాపిట‌ల్ గెయిన్స్‌(Capital Gains), రాయ‌ల్టీ ద్వారా వ‌చ్చే ఆదాయం(Royalty or Residual Income) లేదా అవ‌శేష ఆదాయం ఇవ్వ‌న్నీ పాసివ్ ఇన్‌కంలో ఆదాయ మార్గాలుగా చెప్ప‌వ‌చ్చు.

See also  Saving money plan: ఎంత సంపాదించినా మీ చేతిలో డ‌బ్బు నిల‌వ‌డం లేదా? మీరు ఇవి తెలుసుకోవాల్సిందే!

Leave a Reply

Your email address will not be published.