Core Web Vitals Assessment: Acidity Pain : క‌డుపులో మంట వ‌స్తే ఏం చేయాలి

Acidity Pain : క‌డుపులో మంట వ‌స్తే ఏం చేయాలి?

Acidity Pain : ఉద్యోగ ప‌ని ఒత్తిడిలో చాలా మంది భోజ‌నం చేయ‌డాన్ని ప‌క్క‌న పెట్టేస్తుంటారు. ఫ‌లితంగా క‌డుపు‌లో మంట వ‌స్తుంది. గుండెల్లో మంట‌, అమాశ‌యంలో నొప్పి. ఆహారం అర‌గ‌న‌ట్టు అనిపించ‌డం, త్రేన్పులు, ఆక‌లి త‌గ్గ‌డం, వికారం, వాంతులు నోట్లో నీళ్లూరుతున్న‌ట్టు అనిపించ‌డం లాంటి ల‌క్ష‌ణాలు ఎసిడిటికి సంబంధించిన‌వి.

ఈ స‌మ‌స్య ఎక్కువుగా మ‌హిళ‌ల్లో ఉంటుంది. అనేక సంద‌ర్భాల్లో త‌ల‌నొప్పి , నెల‌స‌రి నొప్పి వంటిని వాటికి మందులు వేసుకున్న‌ప్పుడు పై ల‌క్ష‌ణాలు తీవ్ర ఇబ్బంది పెడ‌తాయి. ఈ ల‌క్ష‌ణాల స‌మూహానికి వైద్య ప‌రిభాష‌లో గ్యాస్ ట్రైటిస్ అని పేరు ఉంది. సాధార‌ణంగా ఎసిడిటి అని పిలుస్తారు. ఆయ‌ర్వేదంలో ఆమ్ల‌పిత్తం అని పేరు ఉంది.

ఆరోగ్య‌క‌ర‌మైన జీవితం, చెడు అల‌వాట్ల‌కు దూరండా ఉండ‌టం, ఆహారం తీసుకోవ‌డంలో అవ‌క‌త‌వ‌క‌లు, మాన‌సిక‌మైన ఆందోళ‌న‌లు, ఇవ‌న్నీ కూడా యాసిడ్ రిప్లెకు కార‌ణం అవుతాయి. నిద్రాహారాలు లేకుండా చేసే ఈ స‌మ‌స్య మీద స‌రైన అవ‌గాహ‌న క‌లిగి ఉంటే దీనిని సునాయాసంగా ఎదుర్కోవ‌చ్చు.

ఆహార నిబంధ‌న‌లు..

Acidity Pain : ఆహారాన్ని కొద్ది మొత్తాల్లో నిదానంగా న‌మిలి తినాలి. హ‌డావిడిగా మింగ‌కూడ‌దు. అలాగ‌ని గంట‌ల త‌ర‌బ‌డి తింటూ కూర్చోకూడ‌దు. గ‌బ‌గ‌బా మింగినా ఆమాశ‌యంలోని యాసిడ్ అన్న‌నాలిక‌లోకి ఒంగి మంట‌గా అనిపిస్తుంది. గంట‌ల త‌ర‌బ‌డి తింటూ ఉంటే ఆహారం స‌గం జీర్ణం, స‌గం కాకుండా అజీర్ణం క‌లుగుతుంది. ఎసిడిటి ఉన్న‌వారు ప్ర‌తి మూడు గంట‌ల‌కు ఏదో ఒక ఆహార ప‌దార్థాన్ని తింటూ ఉండాలి.

నిద్ర‌కూడా ముఖ్య‌మే!

Acidity Pain : ఆహారం తిన్న త‌ర్వాత కొంచెం సేపు కూర్చోవాలి. ఆ త‌ర్వాత వంద అడుగులు అటుఇటు న‌డ‌వాలి. ఆహారం తీసుకున్న వెంట‌నే నిద్ర‌కు ఉప‌క్ర‌మించ‌కూడ‌దు. నిద్ర‌కు, ఆహారానికీ మ‌ధ్య క‌నీసం రెండు గంట‌ల వ్య‌వ‌ధి ఉండేలా చూసుకోవాలి. ఆమాశ‌యంలోనికి ప్ర‌వేశించిన ఆహారం చిన్న ప్రేవులోనికి వెళ్ల‌డానికి అర‌గంట నుంచీ రెండు గంట‌ల వ‌ర‌కు ప‌డుతుంది. ఈ లోపు ప‌డుకుంటే అన్నం మెతుకులు గొంతులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

  1. మ‌నం తీసుకునే ఆహారంలో భోజ‌నానికి – భోజ‌నానికి మ‌ధ్య ఎక్కువ స‌మ‌యం ఖాళీ క‌డుపుతో ఉండ‌కండి. దీంతో ఉద‌రంలో గ్యాస్ పేరుకుపోయే ప్ర‌మాదం ఉంది.
  2. ప్ర‌తి రోజు ఎనిమిది గ్లాసుల నీటిని సేవించేందుకు ప్ర‌య‌త్నించాలి.
  3. ఎసిడిటీతో బాధ‌ప‌డే వారికి తుల‌సి దివ్య‌మైన ఔష‌ధం. తుల‌సి ఆకుల‌ను నిత్యం చ‌ప్ప‌రిస్తుంటే అసిడిటీ నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.
  4. నిత్యం బెల్లం చ‌ప్ప‌రిస్తుంటే అసిడిటీ నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. దీనిని ప్ర‌తి రోజు నాలుగు నుంచి ఐదు సార్లు తీసుకుంటుండాలి.
  5. తీసుకునే ఆహారంలో వీలైనంత మేర‌కు వేపుడు ప‌దార్ధాల‌ను త‌గ్గించాలి. దీంతో పాటు ఊర‌గాయ‌, మ‌సాలా దినుసుల‌తో కూడుకున్న ఆహారం, చాకొలేట్ల‌ను తీసుకోకుండా ఉండేందుకు ప్రయ‌త్నించాలి.
  6. ప‌చ్చి కూర‌గాయ‌ల‌తో త‌యారు చేసిన స‌లాడ్ ను త‌గు మోతాదులో తీసుకోవాలి. ఉదా.. ఉల్లిపాయ‌లు, క్యాబేజీ, ముల్లంగి, వెల్లుల్లి మొద‌లైన‌వి.
  7. ఎసిడిటీతో బాధ‌ప‌డుతుంటే బాదం ప‌ప్పుల‌ను తినాలి.
  8. కొబ్బ‌రి నీళ్ల‌ను రోజుకు మూడు – నాలుగు సార్లు త్రాగాలి.
  9. భోజ‌నాంత‌రం పుదీనా ర‌సం సేవిస్తే అసిడిటీ నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగి మంచి ఫ‌లితాన్నిస్తుంది.
Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *