Achhenaidu : ఆంధ్ర – తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ వాహనాలను నిలిపివేయడంపై మళ్లీ ఉత్కంఠత నెలకొంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఈ విషయంపై చర్చలు జరపాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.
Achhenaidu : ఆంధ్ర – తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ ఆంక్షల నిబంధన అమల్లోకి రావడంతో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయడు సోమవారం స్పందించారు. ప్రతిసారీ ఈ పంచాయతీలేమిటి? అని ప్రజల బాగోగులు ప్రభుత్వానికి పట్టవా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్యం కోసం హైదరాబాద్ వెళ్తున్న వాహనాలపై మళ్లీ తెలంగాణ సరిహద్దుల్లో అడ్డగిస్తున్నారు. దీనిపై అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల బాగోగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పట్టవా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ఆవేదన చెవిటివాని ముందు శంఖంలా తయారైందని తెలిపారు. దేశంలో ఏ ఇతర రాష్ట్రాల్లోనూ ఇటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోవడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ అధికారులు అడ్డగించడంతో వేలమంది హైవేలపై ఇబ్బంది పడుతుంటే ఆంధ్రప్రదేశ్ అధికారులు ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాదా? అక్కడ ప్రత్యేక చట్టాలేమైనా అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. కనీసం మానవతా దృక్ఫథంతో కూడా వ్యవహరించం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలకు ఒక విధానం అంటూ లేకుండా పోతుందని విమర్శించారు.


సీఎం స్పందించరేమిటి?
ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కనీసం పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడే చొరవ చూపడం లేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. వైద్యం కోసం వెళ్లే వారి ప్రాణాలతో ఇద్దరు సిఎంలు చెలగాటమాడుతున్నారన్నారు. అత్యవసరంగా వైద్యం కోసం వెళ్లే మంత్రినో, ఎమ్మెల్యేనో సరిహద్దుల్లో ఆపితే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థమవుతుందని అన్నారు. రాష్ట్రంలో గవర్నెన్స్ లేదని, కనీసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా సమస్యపై దృష్టి సారించడం లేదని విమర్శించారు. తెలంగాణ అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలు ఇబ్బందిపడకుండా ఒక ప్రత్యేక మైన టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోబోదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!