Acharya movie shooting

Acharya movie shooting : ఇల్లందు మైన్స్‌లో ఆచార్య షూటింగ్‌! | Telugu Cinema

Spread the love

Acharya movie shooting :తెలుగు అగ్ర ద‌ర్శ‌కుడు కొర‌టాల శిఖ ద‌ర్శ‌క‌త్వంలో మెగ‌స్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం ఆచార్య(Acharya)‌. ఈ చిత్రం షూటింగ్ మార్చి 7 నుంచి 15వ తేదీ వ‌ర‌కు ఖ‌మ్మం జిల్లా ఇల్లందులోని జేకే మైన్స్‌లో జ‌ర‌గ‌నుంది. ఇల్లందులోని జేకే మైన్స్‌లోని ఓపెన్ కాస్ట్‌, అండ‌ర్ గ్రౌండ్ మైనింగ్ లో షూటింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ర‌వాణాశాఖా మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ ను ఇటీవ‌ల క‌లిశారు. ఆచార్య సినిమా(Acharya movie) షూటింగ్ నేప‌థ్యంలో ఇల్లందులో జేకే మైన్స్‌లో కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేందుకు పువ్వాడ అజ‌య్‌కుమార్‌ను సంప్ర‌దించ‌గా సానుకూలంగా స్పందించారు. షూటింగ్ కోసం స్థానికంగా అనుమ‌తి ఇప్పించ‌డంతో పాటు హీరో చిరంజీవికి త‌న నివాసంలో ఆతిథ్యం ఏర్పాటు చేస్తాన‌ని పువ్వాడ అజ‌య్ కుమార్ తెలిపిన‌ట్టు స‌మాచారం.

ప‌ర్యాట‌కంగా ఖ‌మ్మం అభివృద్ధి చెందింద‌ని, వివిధ చిత్రాల షూటింగ్ ల కోసం ఖ‌మ్మం జిల్లా ఎంతో అనువైన ప్ర‌దేశ‌మ‌ని కొర‌టాల శివ పేర్కొన్నారు. గ‌తంలో పోల్చితే ప్ర‌స్తుతం ఖ‌మ్మం స్వ‌రూపం పూర్తిగా మారింద‌ని, ఇందుకు కృషి చేసిన మంత్రి పువ్వాడ‌కు ఆచార్య సినిమా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ అభినంద‌న‌లు తెలియ‌జేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ మెగాస్టార్ చిరంజీవితో ఫొటోలు దిగిన నేప‌థ్యంలో ఆచార్య షూటింగ్ త్వ‌రంలో ఖ‌మ్మం జిల్లాలో జ‌ర‌గ‌నుంద‌నే వార్త‌ల‌కు ప్రాధాన్య‌త చేకూరిన‌ట్టయ్యింది.

మెగాస్టార్ చిరంజీవితో మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్‌, ప్ర‌క్క‌న కొర‌టాల శివ‌

ఆచార్య సినిమా((Acharya Cineme) లో మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న త్రిష కృష్ణ‌న్ న‌టిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‌పై చిరంజీవి కొడుకు, హీరో రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. అంతేకాకుండా రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్రలో న‌టిస్తున్నారు. ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఆధ్వ‌ర్యంలో వ‌స్తున్న ఆచార్య సినిమా న‌క్స‌లిజం నేప‌థ్యంలో స్టోరీ ఉన్న‌ట్టు తెలుస్తోంది. యాక్ష‌న్ మ‌రియు ఎంట‌ర్‌టైన్‌మెంట్ తో వ‌స్తున్న ఆచార్య సినిమాలో చిరంజీవి ద్విపాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. సంగీతం మ‌ణిశ‌ర్మ అందించారు. ఇప్ప‌టికే ఆచార్య టీజ‌ర్ తెలుగు ప్ర‌జ‌ల‌ను, మెగా ఫ్యామిలీ అభిమానుల‌ను అల‌రించింది. దాదాపు రూ.140 కోట్ల‌తో భారీ అంచ‌నాల‌తో వ‌స్తున్న మెగ‌స్టార్ చిరంజీవి న‌టించిన ఆచార్య సినిమా మే 14న విడుద‌ల కానుంది.

ఇది చ‌ద‌వండి:మంత్రి కొడాలి నాని స్వ‌గ్రామంలో వైసీపీకి షాక్‌!

ఇది చ‌ద‌వండి:ఇనిమెళ్ల గ్రామంలో కొట్టుకున్న టిడిపి-వైసీపీ వ‌ర్గీయులు

ఇది చ‌ద‌వండి:ఎస్సైల‌నే బెదిరించిన కిలాడీ లేడి..చివ‌ర‌కు!

ఇది చ‌ద‌వండి:కొత్త పార్టీపై ష‌ర్మిల బిజీ! ఖ‌మ్మం నేత‌ల‌పై ఫోక‌స్‌!

ఇది చ‌ద‌వండి: ఆ చేప మ‌హా డేంజ‌ర్‌! త‌గిలితే అంతే సంగ‌తులు!

ఇది చ‌ద‌వండి: అన్న‌పై ఎంత అభిమాన‌మో!

ఇది చ‌ద‌వండి: family health optima insurance plan: తెలుగులో తెలుసుకోండి!

ఇది చ‌ద‌వండి:అట‌వీ శాఖ‌కు బాలుడు ఫిర్యాదు,రూ.67వేలు జ‌రిమానా!

Darling Movieకి 11 ఏళ్లు పూర్తి.. ఫొటో షేర్ చేసిన Hero Prabhas

Darling Movieకి 11 ఏళ్లు పూర్తి.. ఫొటో షేర్ చేసిన Hero Prabhas Darling Movie : ఇండియ‌న్ యాక్ట‌ర్ ప్ర‌భాస్‌, హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా Read more

Akhanda Teaser : బోయ‌పాటి – బాల‌య్య కాంబినేష‌న్‌లో ద‌‌ద్ధ‌రిల్లే డైలాగుల‌‌తో అఖండ

Akhanda Teaser : బోయ‌పాటి - బాల‌య్య కాంబినేష‌న్‌లో ద‌‌ద్ధ‌రిల్లే డైలాగుల‌‌తో అఖండ హీరో బాల‌కృష్ణ Akhanda Teaser ఉగాది సంద‌ర్భంగా విడుద‌లైంది. ఈ సినిమాకు బోయ‌పాటి Read more

ARDHASHATHABDAM Teaser: ద‌డ పుట్టిస్తున్న అర్థ‌శ‌తాబ్ధం టీజ‌ర్ మామూలుగా లేదు!

ARDHASHATHABDAM Teaser: ర‌వీంద్ర పుల్లె ద‌ర్శ‌క‌త్వంలో కార్తీక్ ర‌త్నం హీరోగా న‌టిస్తున్న అర్థశ‌తాబ్ధం సినిమా టీజ‌ర్(ARDHASHATHABDAM Teaser) విడుద‌లైంది. ఈ సినిమా పూర్తిగా రాజ‌కీయం, ఫ్యాక్ష‌నిజం తో Read more

Drusyam2 Launch : విక్ట‌రీ ఆధ్వ‌ర్యంలో రాబోతున్న దృశ్యం 2 | Drusyam2

Drusyam2 Launch :Hyderabad: దృశ్యం2 తెలుగు రీమేక్ మంగ‌ళ‌వారం లాంచ్ అయ్యింది.:Hyderabad: దృశ్యం2 తెలుగు రీమేక్ మంగ‌ళ‌వారం లాంచ్ అయ్యింది. ఈ సినిమాలో హీరో విక్ట‌రీ వెంక‌టేష్ Read more

Leave a Comment

Your email address will not be published.