Achala Chit Funds

Achala Chit Funds: అచ‌ల‌ చిట్ ఫండ్ య‌జ‌మాని అరెస్ట్.. ఏకంగా చిట్టీ డ‌బ్బులు అడిగినందుకే..!

Telangana
Share link

Achala Chit Funds హ‌న్మ‌కొండ: న‌గ‌రంలోని నక్క‌ల‌గుట్ట బ్రాంచ్‌లోని జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్‌గా ప‌నిచేస్తున్న ఆడెపు అన్న‌పూర్ణ రూ.10 ల‌క్ష‌ల చిట్టి విభాగంలో మూడు చిట్టీలు వేసింది. చిట్టీల కార ప‌రిమితి ముగిసింది. త‌న మూడు చిట్టీల డ‌బ్బులు ఇవ్వాల‌ని ఆడెపు అన్న‌పూర్ణ అచ‌ల‌ చిట్ ఫండ్ న‌క్క‌ల‌గుట్ట బ్రాంచ్‌లో (Achala Chit Funds)అడిగారు.

ఎన్నిసార్లు అడిగినా ఇవ్వ‌క‌పోగా చిట్టీ వేసిన ఆడెపు అన్న‌పూర్ణ‌ను, చిట్ ఫండ్ య‌జ‌మాని పంచ‌గ‌రి స‌త్య‌నారాయ‌ణ బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. చిట్టీల గ‌డువు ముగిసిన త‌ర్వాత మూడు చిట్టీల డ‌బ్బులు ఇవ్వ‌క‌పోగా చిట్టీలు వేసిన అన్న‌పూర్ణ‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేయ‌డంపై బాధితురాలు సుబేధారి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌గిన సాక్ష్యాధారాల‌ను చూప‌డంతో పోలీసులు విచార‌ణ జ‌రిపి, చిట్ ఫండ్ యజ‌మాని పంచ‌గిరి స‌త్యానారాయ‌ణ‌ను అరెస్టు చేశారు. ఆయ‌న‌ను కోర్టులో హాజ‌రుప‌రిచారు. కేసు పూర్వ‌ప‌రాల‌ను ప‌రిశీలించిన న్యాయ‌మూర్తి 14 రోజుల పాటు రిమాండు విధించ‌డంతో, జైలుకు త‌ర‌లించిన‌ట్టు సుబేధారి ఇన్ స్పెక్ట‌ర్ అల్లే రాఘ‌వేంద‌ర్ తెలిపారు.

See also  Farmer family commits suicide: ఓ రైతు కుటుంబం ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి ప్ర‌య‌త్నం!

Leave a Reply

Your email address will not be published.