Accreditation apply date | తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. దరఖాస్తుల సమర్పణ విషయంలో ఆన్‌లైన్ లో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మరో 10 రోజుల పాటు గడువు పొడిగిస్తున్నట్టు I&PR డైరెక్టర్ రాజమౌళి పేర్కొన్నారు. స్టేట్ లెవల్ అక్రిడేషన్ దరఖాస్తులకు జూన్ 15వ తేదీ వరకు, జిల్లా స్థాయి Accreditation దరఖాస్తులకు జూన్ 20వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఆయా Media సంస్థలు ప్రతిపాదించిన జర్నలిస్టులు తమ దరఖాస్తులను Onlineలో సమర్పించాలని సూచించారు. దాంతో పాటు సంస్థ ప్రతిపాదించిన జాబితాను కూడా సమర్పించాలని పేర్కొన్నారు.
టియూడబ్ల్యూ నాయకుల విజ్ఞప్తి!
అక్రిడేషన్ కార్డుల విషయంలో ఆన్‌లైన్ సైటు(Accreditation apply date)లో తలెత్తిన ఇబ్బంది దృష్ట్యా మరో 5 రోజుల పాటు అంటే ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడవు పెంచాలని జర్నలిస్టులు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసారాలు అందించే Cable ఛానల్స్‌కు అన్ని జిల్లాల్లో కార్డులు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే జర్నలిస్టులకు రాష్ట్ర స్థాయి Accreditation ఇవ్వాలని ఐ అండ్ పిఆర్ డైరెక్టర్ రాజమౌళి, జాయింట్ డైరెక్టర్ జగన్‌ను TUW తరపున జర్నలిస్టుల నాయకులు కలిసి మాట్లాడారు.