NRI Hospital : మంగళగిరిలో ఉన్న ఎన్నారై ఆసుపత్రిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలని ఆసుపత్రి కమిటీ తేల్చి చెప్పింది. ఎంతో కష్టపడి కరోనా పేషెంట్లకు వైద్య చికిత్స అంది స్తున్నామని తెలిపింది. ఇద్దరు పేషెంట్ల పేర్లు పొరపాటు వల్ల కాస్త ఇబ్బంది కలిగిందని పేర్కొంది.
NRI Hospital : గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిపై వచ్చిన ఆరోపణలపై అకాడమీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రనాద్, ఎన్నారై అకాడమీ ట్రెజరర్ డాక్టర్ అక్కినేని మణి స్పందించారు. ఈ నేపథ్యంలో విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. మానవీయ కోణంలో మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో తీవ్ర క్లిష్ట పరిస్థితులలో కరోనా రోగులకు వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది తీవ్ర ఒత్తిడితో విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 12 వేల మంది కరోనా రోగులకు చికిత్స అందించామన్నారు. ఆరోగ్య శ్రీ పథకం క్రింద ఎన్నారై ఆసుపత్రిలో ఎటువంటి అక్రమాలు జరగలేదన్నారు. బిల్లులు వసూలు చేయలేదన్నారు. ఒక్క పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉండటం వల్ల సిబ్బంది పొరపాటు వల్ల సమస్య వచ్చిందన్నారు. దీన్ని ఠాగూర్ సినిమా కథనంలా చిత్రీకరించడం తాము ఖండిస్తున్నామన్నారు.
మే 3వ తేదీన ఉదయం విజయవాడకు చెందిన ఎన్.సామ్రాజ్యం ఆరోగ్య శ్రీ కింద కరోనా చికిత్స కై ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు లామా క్రింద ఎన్. సామ్రాజ్యం డిశ్చార్జ్ కు రిపోర్టు చేసి, వాహన సౌకర్యం లేకపోవడం వల్ల సాయంత్రం 5 గంటలకు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. 8వ తేదీన ఎన్.సామ్రాజ్యం మృతి చెందారు. మే 3వ తేదీన సాయంత్రం 7 గంటలకు మంగళగిరికి చెందిన డి.సామ్రాజ్యం కరోనా చికిత్సకై ఆసుపత్రిలో చేరారు. డి.సామ్రాజ్యం 17వ తేదీన కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. డి.సామ్రాజ్యం పేరుతో ఆరోగ్య శ్రీ కింద నమోదు కాలేదు. ఎన్.సామ్రాజ్యం పేరు మాత్రమే నమోదు అయింది. సిబ్బంది పొరపాటున రికార్డులను గమనించకపోవడం కారణంగా తేలిందన్నారు. దీంతో ఆరోగ్య శ్రీ పోర్టల్ ప్రకారం నమోదు కాబడిన ఎన్.సామ్రాజ్యం కాంటాక్ట్ నెంబర్కు మెసేజ్లు పాస్ అయ్యాయన్నారు. ఇందులో భాగంగా ఎన్.సామ్రాజ్యం ఫోన్ నెంబర్కు డిశ్చార్జ్ నిమిత్తం కాల్ చేసియున్నారన్నారు. ఎన్.సామ్రాజ్యం, డి.సామ్రాజ్యంల నుండి ఆసుపత్రి నుండి ఏ విధమైన బిల్లులు వసూలు చేయలేదని తెలిపారు. ఆరోగ్య శ్రీ కింద కూడా బిల్లులు నమోదు కాలేదని, ఆసుపత్రే ఇరువురికి చికిత్స నిమిత్తం ఖర్చు భరించిందని పేర్కొన్నారు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!