defemation case: సాధారణంగా కొందరు మన స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంటారు. అది కుటుంబం పరంగా గానీ, వ్యాపారం పరంగా గానీ, రాజకీయం పరంగా గానీ లేనిపోని ఆరోపణలు చేస్తూ ఒక వ్యక్తిని సమాజంలో తప్పుగా చిత్రీకరిస్తుంటారు. ఈ సమయంలో బాధితుడు మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎదుట వ్యక్తి అతనిపై ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకునేందుకు చట్టం అందుబాటులో ఉంది. అందులో భాగంగా section 499 (సెక్షన్ 499) కింద పరువు నష్టం దావా వేయవచ్చు. అసలు పరువు నష్టం దావా(defemation case) ఎలా వేయాలి? ఏ సమయంలో వేయాలనేది లాయర్లు చెప్పిన కొన్ని నిబంధనలను పరిశీలించి మీకు అవగాహన నిమిత్తం తెలియజేయడం జరుగుతుంది.

ఒక వ్యక్తికి జరిగిన పరువు నష్టం గురించి ఏ రోజు అయితే జరిగిందో అప్పటి నుంచి బాధితుడు ఒక ఏడాది లోపు క్రిమినల్ చర్యలో భాగంగా పరువు నష్టం దావా కోర్టు ద్వారా వేసుకోవచ్చు.ఈ పరువు నష్టం దావా ఒక ప్రచురణ(ఫ్రింట్) ద్వారా జరిగిందా?, ఒక మాద్యమం ద్వారా జరిగిందా? , లేకా రెండింటీతోనూ జరిగిందా? అనే దానిని బట్టి సెక్షన్ 499 కింద చర్యలు తీసుకోవచ్చు. ఒక వ్యక్తి పైన ఆధారాలు కచ్చితంగా ఉండి ఎదుట వ్యక్తి ఏదైనా బహిరంగంగా వార్త రాస్తే అది పరువు నష్టం దావా కిందకు రాదు. ఎటువంటి ఆధారాలు లేకుండా లేనిపోనివి కల్పించి బాధిత వ్యక్తిపై వార్త రాస్తే అది పరువు నష్టం దావా కింద కేసు నమోదు అయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.
సాధారణంగా ఒక వ్యక్తిపైన, ఒక సంస్థ పైన పరువు నష్టం దావా వేసే బాధితుడు తన పరువుకు భంగం కలిగించారని రూ.50 లక్షలు లేదా కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని కోర్టును ఆశ్రయించే వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అప్పుడు బాధితుడు ఫిర్యాదును కోర్టు పరిశీలించి నిజంగా అతనిపై ఎటువంటి ఆధారాలు లేకుండా అతని పరువుకు భంగం కలిగించారా? లేదా? అని ఖచ్చితంగా విచారిస్తుంది. ఆ విచారణలో నిజమని తేలితే బాధితుడు అడిగినంత డబ్బును తప్పుడు ఆరోపణలు చేసిన వారు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పరువు నష్టం దావా కేసులో బాధితుడు మాత్రమే ఫిర్యాదు చేయాలి. అతని తరపు ఎవరు చేసినా చెల్లదు. ఉదాహరణకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేశారనుకుందాం. అప్పుడు ఆ ముఖ్యమంత్రి దానిని పట్టించుకోక పోవడమో, సమయం లేకపోవడమో జరిగితే అతని అభిమాని అనో, కుటుంబ సభ్యుడనో ఫిర్యాదు చేస్తే చెల్లదు. కచ్చితంగా ముఖ్యమంత్రి ఫిర్యాదు చేస్తేనే
అది కోర్టు స్వీకరిస్తుంది. పరువు నష్టం దావా సామాన్య వ్యక్తి నుంచి సెలబ్రెటీ వరకు అందరికీ ఒకే విధమైన చట్టము, చర్యలు ఉంటాయి.
- world facts: తాబేలు నెత్తిన పడి గ్రీకు నాటక రచయిత మృతి ఇలాంటి ప్రపంచ వింతలు తెలుసుకోండి!
- Castor Oil for hair: జుట్టుకు ఆమదం నూనె అబ్బే అనేవారి కోసమే ఇది!
- Urinary Infections: మూత్రంలో మంట, ఇతర సమస్యలు సులవైన చిట్కాలివే!
- Husband abaddalu: మగవారు ఎక్కువుగా ఆడవారితో చెప్పే 7 అబద్ధాలు ఇవేనట?
- man beauty tips: పురుషులు అందంగా కనిపించాలంటే ఏఏ చిట్కాలు పాటించాలి?