Abortion gang arrested | Gender determination test | నల్గొండలో అబార్షన్ ముఠా అరెస్టుNalgonda: నల్గొండ జిల్లాలో సంచలనమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామీణ మహిళలకు అక్రమంగా లింగ నిర్థారణ పరీక్షలు చేయిస్తూ అబార్షన్లకు పాల్పడుతున్న ముఠాను తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పలు ఆసుపత్రులను సీజ్ చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో గర్భం దాల్చిన మహిళలకు లింగ నిర్థారణ పరీక్షలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఈ ముఠాను గుర్తించిన నల్గొండ పోలీసులు దాడులు చేసి అరెస్టు చేశారు. చిట్యాలలోని భవానీ, సాయితేజ, నార్కట్‌పల్లిలోని చైతన్య, చౌటుప్పల్‌లోని ఉషారాణి ఆసుపత్రుల్లో లింగనిర్థారణ పరీక్షలు చేస్తున్నారని ఆడపిల్లని తేలితే తీపించి వేస్తున్నారని సఖి సెంటర్ కో ఆర్డినేటర్ మందాకిని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సమాచారంపై విచారణ చేపట్టిన పోలీసులు కొంత మంది ఆర్ఎంపీలు లింగ నిర్థారణ పరీక్షలు చేయిస్తూ ప్రజల నుంచి అధిక మొత్తంలో వసూళ్లు చేస్తున్నారని తేలిందన్నారు. డిఎస్పీ వెంకటేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు పోలీసుల పలు ఆస్పత్రులపై దాడులు చేసి ఆధారాలు సేకరించారు. దీంతో బాధ్యులపై కేసులు నమోదు చేసిన పోలీసులు 9 మందిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అక్రమంగా లింగ నిర్థారణ పరీక్షలు చేయించడంతో పాటు అబార్షన్లు చేస్తున్న ఆస్పత్రులను సీజ్ చేశారు. పరారీలో మరో 8 మంది కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇది చదవండి: కోడి కత్తులు స్వాధీనం
ఇది చదవండి: గ్రామ సచివాలయం ఉద్యోగి ఆత్మహత్య