ABNVenkataKrishna

ABNVenkataKrishna :వెంక‌ట‌కృష్ణను తొల‌గించిన ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి?

Spread the love

ABNVenkataKrishna : తెలుగు మీడియాలో సంచ‌ల‌నం సృష్టిస్తోన్న ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి(ABN – Andhra Jyothy) సంస్థ నుంచి సంచ‌ల‌న్మాత‌క వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఏబీఎన్ ఛానెల్‌లో కీల‌క సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు వెంక‌ట‌కృష్ణ‌ను తొల‌గించిన‌ట్టు వార్త‌లు షికారు కొడుతు న్నాయి. ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతిలో కీల‌క పోస్టులో ఉన్న వెంక‌ట‌కృష్ణ ప‌లు డిబెట్ల‌లో త‌న‌దైన శైలిలో తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కొద్ది రోజులుగా ఆయ‌న ఆఫీసుకు రావ‌డం లేద‌ట‌. వారం రోజుల పాటు శెలువులో వెళ్తున్న‌ట్టు ఆఫీస్ వాట్సాఫ్ గ్రూపుల్లో సందేశం పంపిన‌ట్టు స‌మాచారం. అయితే ఏబీఎన్ మేనేజ్‌మెంట్ రాధాకృష్ణ ఆ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టును ప‌ద‌వి నుంచి తొల‌గించిన‌ట్టు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఓ ఇష్యూలో వెంక‌ట‌కృష్ణ భారీగా డ‌బ్బులు తీసుకున్నార‌నే కార‌ణంతోనే ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి నుంచి తొల‌గించార‌ని సోష‌ల్‌మీడియా గ్రూపుల్లో మ్యాట‌ర్ వైర‌ల్ అవుతుంది. అయితే వెంక‌ట కృష్ణ తొల‌గింపు వెనుక మ‌రేదైనా బ‌ల‌మైన కార‌ణం ఉంద‌నేది కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ABNVenkataKrishna

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు వెంక‌ట‌కృష్ణ గ‌తంలో ఈటీవీ, 6 టీవి, టివి-5, ఏపీ 24/7 ఛాన‌ళ్ల‌లో కీల‌క ప‌ద‌వుల్లో ప‌నిచేశారు. టీవీ5, 6 టీవీ లోనూ ఆయ‌న‌పై ప‌లు విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు వ‌చ్చాయ‌నేది తెలుస్తోంది. కొంత కాలంగా ఏపీలో ఉన్న ఏపీ 24/7 ఛాన‌ల్ లో కీల‌క పోస్టులో సీనియ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన‌ప్ప‌టికీ అక్క‌డ కూడా వార్త‌లు వ‌న్‌సైడ్‌గా ప్ర‌సారం చేస్తున్నాడ‌ని మేనేజ్‌మెంట్ అత‌డిని తప్పించింద‌నేది తెలుస్తోంది. కొద్ది కాలంగా ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతిలో కీల‌క స్థానంలో వ్యాఖ్యాత‌గా ఉన్నారు. ప‌లు రాజ‌కీయ పార్టీల డిబెట్లు నిర్వ‌హించి తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌న జ‌ర్న‌లిస్టుగా గుర్తింపు పొందారు.

స్పందించిన వెంక‌ట‌కృష్ణ‌!

త‌న‌పై సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న క‌థ‌నాల‌కు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు వెంక‌ట‌కృష్ణ స్పందించారు. ”ఒక ప్ర‌యాణం ఎన్నో మ‌జిలీలు, స‌వాళ్లు ఉంటాయి. ప్ర‌స్తుతానికైతే సెల‌వు మాత్ర‌మే. అంత‌కు మించి ఏమైనా ఉంటే త్వ‌ర‌లో నేనే చెప్తా. న‌న్నుఅమితంగా ప్రేమించే కొంద‌రు శునకానందంతో ఏదో ట్రోల్ చేస్తోవుంటారు. ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు.” అని ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా స్పందించారు.

https://twitter.com/vkjourno
Trending News April 19: తెలుగు ట్రెండింగ్ ,వైర‌ల్ న్యూస్ ఏప్రిల్ 19,2022

Trending News April 19: ఇండియాలో జ‌రిగిన కొన్ని వైర‌ల్ వార్త‌లు ఇక్క‌డ చ‌ద‌వండి. తాజా స‌మాచారంతో ఎప్ప‌టిక‌ప్పుడు మీ ముందుకు వార్త‌లు తీసుకొస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం Read more

Crow attack in karnataka: వైర‌ల్ News: గ్రామ‌స్థుల‌ను భ‌య‌పెడుతున్న కాకి?

Crow attack in karnataka పాములు ప‌గ‌బ‌డ‌తాయ‌ని విన్నాం! మ‌నుషులు కూడా ప‌గ పడ‌తార‌ని కూడా అంద‌రికీ తెలుసు. కానీ కాకులు ప‌గ‌బ‌డ‌తాయా? అవునా? నిజ‌మా? అనే Read more

Papaya farmer vs RTC: బొబ్బాయి పండు ఇవ్వ‌నందుకు బ‌స్సు ఆప‌ని డ్రైవ‌ర్..త‌ర్వాత రైతు ఏం చేశాడంటే?

Papaya farmer vs RTC క‌ర్నూలు: క‌ష్ట‌ప‌డి దేశానికి అన్నంపెట్టే రైత‌న్న‌ల‌పైనే అంద‌రూ అజ‌మాయిషీ చెలాయించేది. రైత‌న్న‌లు ఈ ఏడాది అస‌లు పంట‌లు పండించ‌కోకూడ‌దూ అనుకొని పెద్ద Read more

Virat-Anushka’s Daughter Vamika’s Pictures Go viral

Anushka Sharma and her daughter Vamika have accompanied Virat Kohli for the India vs South Africa ODI match. Previously when Read more

Leave a Comment

Your email address will not be published.