aadhar card mobile number update : ఇండియాలో ఆధార్ కార్డు ప్రాధాన్యత ఎంత అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని విలువ అందరికీ తెలిసిందే. ఆస్తులు లేకపోయినా పర్వాలేదు గానీ ఆధార్ కార్డు లేకపోతే మాత్రం చాలా కష్టం. ఆధార్ కార్డు నమోదు చేసుకోవడానికి రోజుల తరబడైనా సమయం కేటాయిస్తారు. ప్రభుత్వ పథకాలు రావాలన్నా, బ్యాంకు, లోన్లు ఇలా ప్రతి విషయంలో ఆధార్ నెంబర్ తప్పనిసరి.
ఇప్పుడు మన ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ (aadhar card mobile number update) ఎలా లింక్ చేయాలనేది తెలుసుకుందాం. ఆధార్ కార్డు అందిరికీ వున్నప్పటికీ అందులో ఏదో ఒక లోపం ఉండే ఉంటుంది. పుట్టిన తేదీ లేకపోవడమో, మొబైల్ లింక్ కలిగి ఉండకపోవడమో, ఇంటి పేరు మారకపోవడమో అనేవి సాధారణంగా మనం తరుచూ అనుభవించే ఆధార్ అప్‌డేట్ సమస్యలు. ఆధార్ కార్డులో మనం ఉంటున్న అడ్రస్ నుండి మొబైల్ నెంబర్ తో సహా అన్నీ అప్‌డేటై ఉండాలి.
How to Aadhar card mobile number update
గతంలో ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలంటే కచ్చితంగా మన దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ కానీ, మీసేవా సెంటరును సంప్రదించేవాలము. కానీ ఇప్పుడు టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది వారి యాండ్రాయిడ్ ఫోన్‌లలోనే ఆధార్ కు సంబంధించిన అన్ని అప్‌డేట్స్ చేసుకుంటున్నారు.
ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయాలంటే ఇప్పుడు మన ఇంటిలో ఉండి కూడా చేయవచ్చు. అది ఎలాగంటే India Post ద్వారా https://ccc.cept.gov.in/ లింక్ నొక్కిదే మీ ఆధార్ అపడేట్‌కు సంబంధించిన వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Service Request అని చెప్పి కింద నేమ్, అడ్రస్, పిన్‌కోడ్, ఇమెయిల్, మొబైల్ నెంబర్, సెలెక్ట్ సర్వీసు, సెలెక్ట్ సబ్ కేటగిరి అని విడివిడిగా బాక్సులు ఖాళీగా కనిపిస్తాయి.
మీరు మీ మొబైల్‌లో ఆ వెబ్‌పేజీ ఓపెన్ చేసిన తర్వాత ఆ ఖాళీలన్నీ టైపు చేసి నింపాల్సి ఉంటుంది. అందులో చివరగా Select Service లో ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆ ఆప్షన్‌లో IPPB-Aadhar Services సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత Select Option కనిపిస్తుంది. అందులో UIDAI-Mobile/E-Mail to Aadhar linking/Update ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. మొత్తం పూర్తయిన తర్వాత కింద Request OTP బ్లూ బటన్‌ను నొకాల్సి ఉంటుంది.
పైన తెలిపిన Process పూర్తయిన తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇప్పుడు లింక్ చేశారో? దానికి వెంటనే OTP వస్తుంది. ఆ ఓటిపి తీసుకొచ్చి ఈ బాక్సులో ఎంటర్ చేయాలి. అయితే కొన్ని సార్లు ఈ వెబ్‌పేజీ సర్వర్ ప్రాబ్లమ్ వల్ల కొన్నిసార్లు ఓటిపి రావడం లేదు. కాబట్టి మళ్లీ రెండవ సారి ట్రై చేయండి. కచ్చితంగా ఓటిపి వస్తుంది. ఒక వేళ మొదటి సారే ఓటిపి వస్తే ఆ నెంబర్ ఎంటర్ చేయండి. లేదంటే మరో సారి ట్రై చేయండి.

మీరు సరైన అడ్రస్‌ను మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ మీ మొబైల్ నెంబర్‌కు ఓటిపి రాని యెడల మరో ఫ్రెష్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ నెంబర్‌పై ఇది వరకు ఎటువంటి ఆధార్ కార్డులు లింక్ అయి లేకుండా చూసుకోండి. ఓటిపి వచ్చిన తర్వాత మీరు ఎంటర్ చేయగానే Successfully Request Ref No: 0000 అని వస్తుంది. మీరు ఆ రిఫరెన్స్ నెంబర్‌ను సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ ఏరియాలో ఎవరైనా పోస్టు మాన్ ఉంటే మీ ఇంటి వద్దకు వస్తారు. వారు వచ్చి ఆధార్‌కు మొబైల్‌ను అప్‌డేట్ చేస్తారు.
మీకు ఒక వేళ అర్జెంటుగా ఆధార్‌కు మొబైల్ నెంబర్ అప్‌డేట్ కావాలంటే మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్‌ను సంప్రదించండి. ఎవరైతే కొన్ని రోజులైనా ఇబ్బంది లేదు అనుకుంటే పైన తెలిపిన aadhar card mobile number update ప్రాసెస్‌ను ఎంచుకోండి. కచ్చితంగా ఇది వర్క్ అవుతుంది.