Honey Trap : హనీ ట్రాప్ ముఠా వేధింపులకు యువకుడు బలి
Honey Trap : తెలంగాణ రాష్ట్రంలో హనీ ట్రాప్(Honey Trap) ముఠా వేధింపులకు ఓ యువకుడు బలైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ యువకుడుకి నగ్నంగా వీడియో కాల్ ఫోన్ చేసింది ఓ యువతి. దీనికి ఆకర్షితుడైన ఆ యువకుడును కూడా నగ్నంగా వీడియో కాల్ చేయమని ప్రోత్సహించింది. ఆ వీడియో మొత్తం రికార్డు చేసిన యువతి తన వెనుక ఉన్న హనీ ట్రాప్ ముఠాతో డబ్బుల కోసం వేధింపులకు పాల్పడం ప్రారంభించింది. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానని ముఠా బెదిరించింది. దీంతో యువకుడు తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు వెలుగులోకి వచ్చింది.
నిజామాబాద్ జిల్లా కు చెందిన 22 ఏళ్ల యువకుడు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హాస్టల్ లో ఉంటూ చదువుతున్నాడు. కొన్ని రోజుల క్రితం ఓ యువతి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్కు యువకుడు ఆకర్షితుడైయ్యాడు. వీడియో కాల్లో యువతి నగ్నంగా కనిపించి మాట్లాడటంతో పాటు యువకుడిని నగ్నంగా ఉండి మాట్లాడాలని ప్రేరేపించింది. ఇదే క్రమంలో యువతి ఈ వీడియోను రికార్డు చేసింది.ఆ తర్వాత నుంచి డబ్బులు కోసం యువకుడిని వేధించడం మొదలు పెట్టింది. తొలుత యువకుడు స్పందించకపోవడంతో ఆ యువతి తన ముఠాతో కలిసి యూట్యూబ్లో నగ్నంగా ఫోన్లో మాట్లాడిన వీడియోలను పెడతానంటూ బెదిరించింది. వారి ఒత్తిళ్లకు తలొగ్గిన యువకుడు వారు పంపిన అకౌంట్ నెంబర్కు రూ.24,000 వేలను పంపించాడు.


డబ్బులు పంపించినప్పటికీ వారి వేధింపులు ఆగలేదు. ఇంకా డబ్బు కావాలంటూ ఆ యువకుడిని బెదిరించారు. ముఠా బెదిరింపులకు భయపడిన యువకుడు నాలుగు రోజుల కిందట నిజామాబాద్ జిల్లాలోని తన స్వగ్రామమైన నవీన్పేటకు వెళ్లాడు. తన పొలం దగ్గర పురుగులు మందు తాగాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కుమారుడును బతికించుకునేందుకు సికింద్రాబాద్లో ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుడా పోయింది. పరిస్థితి విషమించి యువకుడు మృతి చెందాడు. ఈ క్రమంలో అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు హనీ ట్రాప్ ముఠా కోసం గాలిస్తున్నారు.
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started