Suicide News : అప్పులు బాధ‌తో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య

By | April 10, 2021

Suicide News : అప్పులు బాధ‌తో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య

Suicide News : అప్పులు బాధ తాళ లేక వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న పశ్చిమ గోదావ‌రి జిల్లాలో శ‌నివారం చోటు చేసుకుంది. మండ‌వ‌ల్లి ఎస్ఐ చ‌ల్లా కృష్ణ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఆకివీడు మండ‌లం, అప్ప‌రావుపేట గ్రామానికి చెందిన కొప్పాటి న‌ర‌సింహస్వామి (30) త‌న భార్య పిల్ల‌ల‌తో క‌లిసి గ‌త కొంత కాలంగా మండ‌వ‌ల్లి మండ‌లం, చావ‌లిపాడు గ్రామంలో శివాజీ రాజు చేప‌ల చెరువు పై ప‌నిచేస్తూ అక్క‌డే నివ‌సిస్తున్నారు.

అయితే మృతుడు న‌ర‌సింహ స్వామి గ‌త కొంత కాలంగా మ‌ద్యానికి బానిస‌య్యాడు. అప్పులు బాగా చేసిన‌ట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఫైనాన్స్ పై కొనుకున్న మోటార్ సైకిల్ కూడా కిస్తీలు క‌ట్ట‌లేక పోవ‌డంతో ఫైనాన్స్ సిబ్బంది మోటారు సైకిల్‌ను తీసుకొని వెళ్లారు. దీంతో తాను చేసిన అప్పులు తీర్చ‌లేమోన‌ని భ‌యంతో పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

భ‌ర్త నోటి నుండి నురుగు రావ‌డం చూసిన భార్య చుట్టుప్ర‌క్క‌ల వారి స‌హాయంతో కైక‌లూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డ డాక్ట‌ర్ ప‌రీక్షించి అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్టు నిర్థారించారు. ఈ ఘ‌ట‌న‌పై మృతుని భార్య కొప్పాటి ల‌క్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు మండ‌వ‌ల్లి ఎస్ఐ చ‌ల్లా కృష్ణ కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. శ‌వ పంచ‌నామా అనంత‌రం, పోస్టు మార్టం నిర్వ‌హించి మృత‌దేహాన్ని బంధువుల‌కు అప్ప‌గించారు.

చ‌ద‌వండి :  Suicide: Chaitanya Collegeలో విద్యార్థిని అనుమాన‌స్ప‌ద మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *