Plastic surgery: మెక్సికోలోని sinaloa రాష్ట్రం ఆ దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన, మాదక ద్రవ్యాల ముఠాకు శక్తి వంతమైన నిలయంగా పేరుంది. ఇక్కడ సాగించే మాదక ద్రవ్యాల వ్యాపారం, దాని నుండి వచ్చే డబ్బు మత్తుకు బానిసైన వారితో పాటు అక్కడ నివసిస్తున్న స్థానిక యువతులపైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీటి వల్లే ఇక్కడ అమ్మాయిలు, యువతులు Plastic surgeryతో శరీరాకృతిని మార్చుకునేందుకు క్యూ కడుతున్నారట. ఈ ప్లాస్టిక్ సర్జరీలు ఎంతో ఖరీదైనవి. అయితే ఈ ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్లు చేయించుకోలేని మహిళలు వీటి ఖర్చును భరించే వారికి తమ శరీరాలను అప్పజెప్పడానికి కూడా సిద్ధపడుతున్నారు.
Narco Ecstatic body shape అంటే ఏమిటి?
నార్కో ఈస్తటిక్ బాడీ షేప్ అంటే బాగా సన్నని నడుము, విశాలమైన కటిభాగం, అందుకు తగినట్టుగా భారీ వక్షోజాలు ఉండే శరీరమని సినలోవ రాష్ట్రంలో ఉండే డాక్టర్లు చెబుతున్నారు. శరీరాన్ని నార్క్ ఈస్తటిక్ గా మార్చుకునేందుకు యువతులు ఎగబడుతున్నారని చెబుతున్నారు. ఈ సర్జరీలు చేయించుకునే వారు వయస్సు 30-40 సంవత్సరాల మధ్య ఉన్నవారే అధికంగా ఉన్నారు. కొన్ని కొన్ని సార్లు 18 సంవత్సరాల లోపు యువత కూడా ఈ సర్జరీలు చేయించుకునేందుకు క్యూ కడుతున్నారని డాక్టర్ రఫేలా అన్నారు. శరీరంలో తనకు నచ్చని భాగాన్ని అందంగా రూపుదిద్ధుకునేందుకు అక్కడ యువతులు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కొక్క మహిళ 20కు పైగా కాస్మోటిక్ సర్జరీలు చేయించుకుంటారని అక్కడ సర్జరీ చేయించుకున్న ఓ యువతి పేర్కొంటుంది.
La Buchanan అంటే?
ఇసుక గడియారం లాంటి శరీరాకృతిని అక్కడ లా బుచోనా అంటారు. మాదక ద్రవ్యాలతో పాటు డిజైన్ వస్తువులు ధరిస్తూ శరీరాకృతిని షేప్ చేయించుకునే యువతులను లా బుచోనాగా పిలుస్తారు. అక్కడ ఇలాంటి అమ్మాయిలను తమ గర్ల్ ప్రెండ్స్‌గా ఉంచుకోవడానికి మాదక ద్రవ్యాలు సప్లై చేసే ముఠా బాగా ఇష్టపడుతారట. అయితే ఇలాంటి శరీరాకృతి పొందిన మహిళల్లో చాలా మంది ఫ్యాషన్‌లో పోటీ పడేందుకే ఈ రూపంలోకి మారామాని, మాదక ద్రవ్యాల వ్యాపారులతో, స్మగ్లర్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.
ఒక్కొక్క సర్జరీకి దాదాపు 6,000 అమెరికా డాలర్లు ఖర్చు అవుతుందని ఆ రాష్ట్రానికి చెందిన డాక్టర్ రఫేలా తెలిపారు. ఈ శస్త్ర చికిత్స కోసం వచ్చేవారిలో కొందరు వారి తల్లులతో, మరికొందరు వారి స్నేహితులతో కలిసి వస్తుంటారు. మరికొందరు ఎవరైనా మగవాడితో కలిసి వస్తారు. ఇంకొందరు వారి బాయ్‌ఫ్రెండ్స్‌తో వస్తారు. ఆ బాయ్‌ఫ్రెండే సర్జరీకి డబ్బులు ఇస్తారు. మరికొందరు అయితే డాక్టర్ గారు ఒక అమ్మాయిని పంపిస్తున్నాను ఆపరేషన్ చేయండి. అంటూ సింపుల్‌గా ఫోన్ చేసి చెబుతుంటారని వివరించారు డాక్టర్ రఫేలా. కొందరైతే ఆ అమ్మాయి చెప్పినట్టు కాకుండా తాము చెప్పినట్టు చేయాలని, తాము డబ్బులు చెల్లించేది కూడా అందుకేనని ఈమె చెబుతుంటారు. అలాంటప్పుడు ఆ అమ్మాయికి చెప్పిన తర్వాతే తన దగ్గరకు పంపించాలని సూచిస్తానని డాక్టర్ అంటుంటారు.
సర్జరీలకు ముందు ఏం చెబుతారంటే?
ఈ సర్జరీలకు ఉపయోగించే డబ్బు అంతా చాలా సందర్భాల్లో మాదకద్రవ్యాల వ్యాపారుల నుంచి వచ్చినదే. ఒక్కప్పుడు ఇది కరెక్ట్ మార్గం కాదని అమ్మాయిలకు చెప్పేదానని, కానీ ఇప్పుడు ఎక్కువుగా ఆలోచించడం మానేశానని డాక్టర్ రఫేలా తెలిపారు. మీ శరీరం మీ ఇష్టం వచ్చినట్టు ఉండాలి కానీ, మీ పురుషుడు చెల్లించే డబ్బు వల్ల కాదు. బాయ్‌ఫ్రెండ్ ఎన్నాళ్లు ఉంటాడో తెలియదని, జీవితం ముగిసే వరకు మీ శరీరం మీతోనే ఉంటుందని ఆలోచించుకోండని సర్జరీకి ముందు అమ్మాయిలకు చెబుతానని డాక్టర్ రఫేలా అంటున్నారు. ఆడ- మగ మధ్య సంబంధాలు సినలోవా రాష్ట్రంలో చాలా సాధారణం.
పక్కన అమ్మాయి ఉండాల్సిందే!
మాదకద్రవ్యాల వ్యాపారంలో ఉండే ప్రతి మగవాడికి ప్రక్కన అందమైన అమ్మాయి ఉండాల్సిందేనని అక్కడ మాదక ద్రవ్యాల వ్యాపారులు చెబుతున్నారు. Narco Ecstatic సర్జరీ(Plastic surgery)కి అయ్యే ఖర్చు కోసం కొంత మంది ఆడవాళ్లు మగవాళ్ల కోసం ఎదురు చూస్తుంటారని చెబుతున్నారు. సర్జరీకి డబ్బులు ఇస్తే ఆరు నెలల పాటు ఈ శరీరం మీదే అని ఆ మహిళలు చెబుతారని మాదక ద్రవ్యాల వ్యాపారులు అంటున్నారు. ఒక్కొక్క సారి కార్లు, ఇళ్లు, విలాసవంతమైన జీవితం కోసం ఈ అనధికారిక ఒప్పందాలు జరుగుతుంటాయి.


సినలోవా రాష్ట్రంలో పేదరికం ఎక్కువ. సాయుధ ముఠాల వల్ల ఇక్కడ ప్రజల జీవితం ఎప్పుడూ ప్రమాదకరంగానే ఉంటుంది. ఇలాంటి చోట్ల గాడ్ ఫాదర్లుగా పిలిచుకునే శక్తివంతమైన మాదకద్రవ్యాల వ్యాపారులు తమకు అండగా ఉంటే విలాసవంతమైన జీవితంతో పాటు రక్షణ దొరుకుతుందని అక్కడ చాలా మంది అమ్మాయిలు భావిస్తారు. ఆ గాడ్ ఫాదర్‌తో వేరే అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయో లేదో వీరికి తెలియదు. అక్కడ అదేమీ పెద్ద విషయమూ కాదు. కానీ మాదకద్రవ్యాల వ్యాపారులతో తిరిగే అమ్మాయిలకు ఎప్పుడు ఏమౌతుందో తెలియదు. మెక్సికో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మహిళలు హత్యకు గురవుతున్నారని అక్కడ ఓ మహిళా లాయర్ చెబుతున్నారు. మాదర ద్రవ్యాల ముఠాలో ఒక బాయ్ ఫ్రెండ్ తనతో ఉన్న అమ్మాయికి ప్లాస్టిక్ సర్జరీ చేపించిన తర్వాత ఒక సమయంలో ఆ అమ్మాయి వక్షోజాలు, పిరుదలపై కాల్పులు జరిపాడు. అతని ఆవేశం ఏమిటంటే.. నేను పెట్టిన డబ్బులతో ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న అవయవాలు కదా! అంటు సమాధానం ఇచ్చాడు. ఏమైనా అక్కడ యువతులకు ప్రమాదం పొంచి యున్నదనడంలో సందేహం లేదు.
- MLA Seethakka: తెలంగాణలో నీళ్లేవూ..నిధులూ లేవూ!
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!