Lockdown : ఒడిశాలో లాక్‌డౌన్ ప్ర‌క‌ట‌న‌

0
68
views

Lockdown : ఒడిశా ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్ర‌క‌ట‌న చేసింది. క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం 18 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్టు తెలిపింది.


Lockdown : క‌రోనా ఉద్ధృతి పెరుగుతున్న నేప‌థ్యంలో ఆ కేసుల‌ను నియంత్రించేందుకు ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ అస్త్రాన్ని ప్ర‌యోగిస్తున్నాయి. ఆ జాబితాలో తాజాగా మ‌రో రాష్ట్రం చేరింది. ఒడిశా కూడా లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, క‌ర్ణాట‌క రాష్రాల్లో లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. ఒడిశాలోనూ రోజూ 5,000 వేల‌కు పైగా కేసులు న‌మోదువుతుండ‌టంతో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ లాక్‌డౌన్ విధించింది. ఇవాళ్టి నుంచి (ఆదివారం ) మే 19 వ‌ర‌కు 18 రోజుల పాటు లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌ని న‌వీన్ ప‌ట్నాయ‌క్ స‌ర్కారు ప్ర‌క‌టించింది. క‌ఠిన ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని వెల్ల‌డించింది. ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావొద్ద‌ని సూచించింది. ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌నూ బంద్ పెడుతున్న‌ట్టు స్ప‌ష్టం చేసింది. నిత్య‌వ‌స‌రాల‌ను కొనుగోలు చేసేందుకు మాత్రం అనుమ‌తినిచ్చింది. అయితే ఉద‌యం 6 గంట‌ల నుంచి ధ్యాహ్నం 12 గంట‌ల‌లోపే ఏది కావాల‌న్నా కొనుగోలు చేయాల‌ని సూచించింది. అది కూడా అర కిలోమీట‌రు దూరంలో ఉన్న షాపులు లేదా కూర‌గాయ‌ల దుకాణాల‌కే న‌డుచుకుంటూ వెళ్లాల‌ని తెలిపింది. వైద్య‌సేవ‌లు, నిత్యావ‌సర సేవ‌లు అందించే వాహ‌నాల‌పై ఎలాంటి ఆంక్ష‌లు ఉండ‌బోవ‌ని పేర్కొంది. రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 8,015 కొత్త కేసులు న‌మోద‌వ్వ‌గా 14 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,62,622కు పెరిగింది. మొత్తంగా 2,068 మంది చ‌నిపోయారు.

Share Link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here