Murder Case

Murder : అన్న‌ద‌మ్ముల ఆస్తి త‌గాదాల‌కు కూలీ బ‌లి!

Andhra Pradesh
Share link

Murder : ప‌నికి వెళ్లిన కూలీని ఇనుప‌రాడ్డుతో హ‌త్య చేయ‌బ‌డ్డాడు. ఈ సంఘ‌ట‌న నాగాయ‌లంక మండ‌లంలో చోటు చేసుకుంది. ఆస్తిగొడ‌వ‌ల నేప‌థ్యంలో కూలీని హ‌త్య చేసిన‌ట్టు తెలిసింది.


Murder : అన్న‌ద‌మ్ముల‌కు ఉన్న ఆస్తి త‌గాదాల నేప‌థ్యంలో ప‌నికి వెళ్లిన కూలీని దారుణంగా హ‌త్య చేశారు. ఈ సంఘ‌ట‌న కృష్ణా జిల్లా నాగాయ‌లంక మండ‌లంలో ఆదివారం చోటు చేసుకుంది. నాగాయ‌లంక మండ‌లం బ్ర‌హ్మానంద పురానికి చెందిన స‌బ్బినేని ముర‌ళీ, అత‌ని అన్న స‌బ్బినేని అనిల్ మ‌ధ్య ఆస్తి త‌గాదాలు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో అనిల్ ఇంటి ద‌గ్గ‌ర ప‌నిచేసేందుకు ఆరుంపాక స‌ద్గుణ‌రావు (45) కూలి ప‌నికి వెళ్లాడు. ఇది చూసిన ముర‌ళి స‌ద్గుణ‌రావు తల‌పై ఇనుప‌రాడ్ల‌తో బ‌లంగా దాడి చేయ‌డంతో కూలీ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. సంఘ‌ట‌నా స్థలానికి అవ‌నిగ‌డ్డ డీఎస్పీ మ‌హ‌బూబ్ బాషా, సీఐ ర‌వికుమార్‌, ఎస్సై శ్రీ‌నివాస్‌లు చేరుకుని విచార‌ణ చేప‌ట్టారు.పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాన్ని అవ‌నిగడ్డ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి పోలీసులు త‌ర‌లించారు.

See also  Rajamahendravaram: Rowdy sheeter brutally murdered in Rajamahendravaram :రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో  రౌడీ షీట‌ర్ దారుణ హ‌త్య‌

Leave a Reply

Your email address will not be published.