A.Konduru SI T.Srinivas | ఏ కొండూరు మండలం రేపూడి తండాకు చెందిన లాకావత్ బాలాజీ ఆత్మహత్య ఘటనలో ఏ కొండూరు ఎస్సై టి.శ్రీనివాస్ ను జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సస్పెండ్ చేశారు.మంగళవారం ఉదయం బాలాజీ ఆత్మహత్య చేసుకోవడంతో మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రేపూడి తండాకు చెందిన లకావత్ బాలాజీ నాయక్(62) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నాటు సారా విక్రయిస్తున్నాడన్న కారణంగా గత రాత్రి సోమవారం రాత్రి స్టేషన్కు అతన్ని పోలీసులు తరలించారు.
ఈ క్రమంలో స్టేషన్ ఎస్సై తీవ్రంగా కొట్టడంతో మనస్థాపానికి గురైన బాలాజీ నాయక్(balaji nayak) మంగళవారం ఉదయం నారికంపాడు రోడ్డులోని ఖాళీ ప్రదేశంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించే సమయంలో బాలాజీ నాయక్ మృతి చెందారు.
ఆందోళన చేసిన కుటుంబ సభ్యులు
బాలాజీ నాయక్ ఎస్సై కొట్టడం వల్లే చనిపోయాడని కుటుంబ సభ్యులు మంగళవారం ఏ.కొండూరు పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులు, సిఐలు, ఎస్సైలు చేరుకుని న్యాయం చేస్తామని ఆందోళన చేయవద్దని బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
A.Konduru SI T.Srinivas | ఎస్సై సస్పెండ్!
బాలాజీ నాయక్ చనిపోవడానికి కారణం ఎస్సై టి.శ్రీనివాస్ తీవ్రంగా కొట్టడమనే ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఎస్సైను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యహరించిన మైలవరం ఇన్ప్సెక్టర్ రమేష్పైన క్రమశిక్షణ చర్యలకు నూజివీడు డిఎస్పీని వివరణ కోరుతూ నోటీసు జారీ చేశారు. గతంలో ఏ.కొండూరు స్టేషన్ ఎస్సై ఇదే తరహా ఆరోపణలు సంచలనం కలిగించాయి.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ