Missing case

Missing case: ఇంటి నుంచి పారిపోయాడు! కృష్ణా న‌ది ఒడ్డున కూర్చున్నాడు! చివ‌ర‌కు..?

Spread the love

Missing case: త‌ప్పిపోయిన బాలుడును స‌రిగ్గా 36 గంట‌ల్లో కృష్ణాజిల్లా ఏ.కొండూరు పోలీసులు ప‌ట్టుకుని వారి కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు. వివ‌రాల్లోకి వెళితే..


Missing case: ఏ.కొండూరు: ఈ నెల 15వ తేదీ నుంచి ఏ.కొండూరు తండాకు చెందిన భూక్యా వెంక‌ట ద‌త్త‌(బ‌బ్లూ) అనే 14 సంవ‌త్స‌రాల బాలుడు క‌నిపించ‌కుండా పోయాడు. బాలుడి త‌ల్లిదండ్రులు కుమారుడు కోసం వెతికి వెతికి ఆందోళ‌న చెందారు. చివ‌ర‌కు ఈ నెల 18వ తేదీన ఏ.కొండూరు పోలీస్ స్టేష‌న్‌ను ఆశ్ర‌యించారు. వెంట‌నే స్పందించిన పోలీసులు బాలుడి త‌ల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ప‌రంగా కేసు న‌మోదు చేశారు. కృష్ణాజిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశిల్ ఆదేశాల‌తో నూజివీడు డిఎస్పీ బుక్కాపురం శ్రీ‌నివాసులు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, మైల‌వ‌రం సీఐ శ్రీ‌ను ఆధ్వ‌ర్యంలో ఏ.కొండూరు ఎస్సై టి.శ్రీ‌నివాస్ విచార‌ణ చేప‌ట్టారు. ఎస్సై ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక బృందాలుగా ఏర్ప‌డ్డారు. సోష‌ల్ మీడియాలో బాలుడు వివ‌రాల‌ను జిల్లా మొత్తం చేరేలా త‌గు చ‌ర్య‌లు తీసుకున్నారు. విజ‌య‌వాడ ప‌రిస‌ర ప్రాంతాల్లో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇబ్ర‌హీంప‌ట్నం, బ‌స్‌స్టాండ్‌, రైల్వే స్టేష‌న్ ప‌రిస‌ర ప్రాంతాల్లో గాలించారు.

బాలుడ్ని త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గిస్తున్న పోలీసులు

చివ‌ర‌కు సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన వార్త‌లు చూసిన వ్య‌క్తులు చెప్పిన వివ‌రాలు ఆధారంగా కృష్ణాన‌ది ఒడ్డున బాలుడు ఆచూకీ తెలుసుకున్నారు. అక్క‌డ నుంచి బాలుడుకి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి సౌజన్యంతో పోలీసువారు కౌన్సిలింగ్ నిర్వ‌హించారు. అనంత‌రం ఏ.కొండూరు పోలీస్ స్టేష‌న్‌లో బాలుడి త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించారు. ఈ సంద‌ర్భంగా 36 గంట‌ల వ్య‌వ‌ధిలో బాలుడి ఆచూకీ క‌నుగొన్న ఏ.కొండూరు ఎస్సై టి.శ్రీ‌నివాస్‌, వారి సిబ్బంది హెచ్‌.సి. స‌ర్వేశ్వ‌ర‌రావు, పి.సి ప్రేమ్ కుమార్‌ల‌ను అభినందించారు. సిబ్బందికి త‌గిన రివార్డుల‌కై ఎస్పీకి సిఫార్సు చేస్తామ‌ని తెలిపారు.

Pedana(Krishna): విషాదం: అప్పుల బాధ‌తో చేనేత కుటుంబం ఆత్మ‌హ‌త్య‌

Pedana(Krishna) పెడ‌న: అప్పుల బాధ‌తో ఓ చేనేత కుటుంబం (Handloom family suicide)అంతా సామూహిక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విషాద సంఘ‌ట‌న కృష్ణా జిల్లా పెడ‌న‌లోని మంగ‌ళ‌వారం వెలుగుచూసింది. Read more

Chevuturu(Krishna) Road accident:ఘోర రోడ్డు ప్ర‌మాదం ఆరుగురు ప్ర‌యాణికులు మృతి?

Chevuturu(Krishna) Road accident చెవుటూరు: కృష్ణా జిల్లా జి.కొండూరు మండ‌లంలోని చెవుటూరు స‌మీపంలో సోమ‌వారం ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. తిరువూరు డిపోకు చెందిన ఎక్సప్రెస్ Read more

Tiruvuru Revenue Division:తిరువూరు రెవెన్యూ డివిజ‌న‌ల్ స్వాగ‌తిస్తూ సంబురాలు!

Tiruvuru Revenue Division ఎ.కంభంపాడు: కృష్ణా జిల్లా నుండి విడిపోయిన ఎన్టీఆర్ జిల్లా (విజ‌య‌వాడ‌)లో తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగా తిరువూరు రెవెన్యూ డివిజ‌న‌ల్‌ను ప్ర‌భుత్వం నిర్థారించింది. దీనిని Read more

Nuzvid Covid Cases: నూజివీడు డివిజన్ లో కొత్తగా 168 కోవిడ్ కేసులు

Nuzvid Covid Cases నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు డివిజన్ లో 28వ తేదీన కోవిడ్ కేసులు పెద్దఎత్తున నమోదయ్యాయి. 28వ తేదీ ఒక్కరోజే 168 కోవిడ్ Read more

Leave a Comment

Your email address will not be published.