Remdesivir Injection : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో రెమిడిసివిర్ ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ దందా చేస్తున్న ముఠాను గుంటూరు అర్బన్ కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు.
Remdesivir Injection : కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రెమిడిసివిర్ ఇంజక్షన్ అనుమతి ఉన్న ఆస్పత్రులకు మాత్రమే సరఫరా అవుతుంది. ఈ క్రమంలో అనుమతి లేని ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న పేషెంట్ల యొక్క అవసరాన్ని ఆసరాగా చేసుకొని రెమిడిసివిర్ ఇంజక్షన్ లను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తు న్నారు. అయితే గుంటూరు అర్బన్ పోలీసులు ఈ ముఠాలపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఆదేశాల మేరకు కొత్తపేట సీఐ రాజశేఖర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. కోవిడ్ బాధితులుగా అంకమ్మరావు అనే వ్యక్తిని సంప్రదించగా అతను ఒక్కొక్క రెమిడిసివిర్ ఇంజక్షన్ ను రూ.38,000 వేల చొప్పున 6 ఇంజక్షన్‌ను రూ.2,28,000 లక్షలకు అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకుని ఇంజక్షన్లు డెలివరీ ఇచ్చే సమయంలో అంకమ్మ రావుని అదుపులోకి తీసుకొని విచారించారు. అతను రత్నరాజు అనే అతని వద్ద ఒక్కొక్క ఇంజక్షన్ రూ.34,000 చొప్పున కొనుగోలు చేసి రూ.4,000 వేల లాభానికి అమ్ముతున్నట్టు చెప్పారన్నారు.


రత్నరాజును అదుపులోకి తీసుకొని విచారించగా తాను గుర్నాథం వద్ద రూ.26,000 వేలు చొప్పున కొనుగోలు చేసి రూ.34,000 వేలకు అమ్ముతూ 8 వేలు లాభం చూసుకుంటున్నట్టు అంగీకరించారు. నూనె గుర్నాధం అలియాస్ నాని ని అదుపులోకి తీసుకొని విచారించగా తాను పనిచేసే కిడ్నీ కేర్ హాస్పిటల్ లోని శివ మెడికల్స్ ఫార్మసిస్ట్ పేరం చంటి అనే అతను నుండి అదే హాస్పటిల్ లో పని చేస్తున్న కృష్ణ వేణి ద్వారా ఒక్కొక్క ఇంజక్షన్ రూ.20,000 చొప్పున కొనుగోలు చేసి రూ.6,000 వేల లాభానికి అమ్ముతున్నట్టు అంగీకరించారు. ఇలా అందర్నీ పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 6 రెమిడిసివిర్ ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేశారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వ్యక్తులు ఎంతటి వారు అయినా సహించేది లేదని, చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుం టామని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు.
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started