Fishing : చేపల కోసం వెళ్లిన జాలర్లకు షాక్!
Fishing : చేపల కోసం చెరువులో వలేసిన జాలర్లకు అదిరిపడేంత షాక్ తగిలింది. చేపల వలలో 100 కేజీలకు పైగా బరువున్న భారీ మొసలి(crocodile) చిక్కుకోవడంతో అందరూ షాకయ్యారు. దీన్ని ఫారెస్టు అధికారులకు అప్పగించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బొమ్మాయికుంటలో చేపలు పట్టేందుకు కొందరు జాలర్లు చెరువు వద్దకు వెళుతుంటారు. మంగళవారం కూడా గ్రామానికి చెందిన మత్స్యకారులు పెసరి శివ, స్వామి, రాములు రాత్రి కూడా చేపలు పట్టడం కోసం ఊర చెరువులో వలలు ఏర్పాటు చేశారు.

తెల్లవారిన తర్వాత బుధవారం వలలో పడిన చేపలను బయటకు తీసేందుకు వచ్చి చూడగా ఆ వలలో ఓ భారీ మొసలి(crocodile) చిక్కుకుని కనిపించింది. సుమారు 100 కిలోలకు పైగా బరువున్న మొసలిని బంధించేందుకు రెండు గంటల పాటు శ్రమించి బంధించారు. అనంతరం ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు దాన్ని స్వాధీనం చేసుకుని పాకాల సరస్సులో విడిచిపెట్టారు.
- Nara Lokesh : విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమొద్దు
- Second Wave: నాడు అగ్రరాజ్యాన్ని నేడు భారత్‌ను Covid చుట్టుముట్టింది!
- Bathroomలో Current తో జాగ్రత్త! ఏఏ పద్ధతులు పాటించాలి?
- Stone Rain రాళ్ల వర్షం కురిసింది ఎక్కడో తెలుసా!(వీడియో)
- Pension పై ఏపీ ప్రభుత్వం కొత్త రూల్ | బోగస్ కార్డుల ఏరివేతకేనా?