7 Glasses Water | రోజుకి ఏడు గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరంలో 200 కాలరీలు తగ్గుతాయట. ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ ఇది నిజం. ముఖ్యంగా డిటాక్సర్స్, డైటర్స్ నీళ్లు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. శరీరంలోని మలినాలు బయటకు పోతాయి. అయితే ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో అదనంగా మరికొన్ని గ్లాసుల నీళ్లు (7 Glasses Water)తాగడం మంచిదని తేలింది. దీని వల్ల కడుపు నిండుగా ఉండి ఆహారం మితంగా తింటాం. ఫలితంగా శరీరంలో calories తగ్గుతాయి.
పరిశోధనలో తేలిందేమిటంటే?
2005 నుంచి 2012 సంవత్సరం వరకు మొత్తం 18,300 మంది డయాటరీ అలవాట్లను అధ్యయనకారులు పరిశీలించారు. మిగతా అంశాలతో పాటు క్లయింట్లు మంచినీళ్లు(good water) ఎంత తాగుతున్నారు. అలాగే తీపిలేని లిక్విడ్స్ అంటే coffee, tea వంటివి ఎంత తీసుకుంటున్నారు వంటి విషయాలను కూడా గమనించారు. వీటన్నింటిని బట్టి రోజులో నీటి వినియోగం ఎంత ఉందో లెక్కగడతారు. ఈ అధ్యయనంలో క్లయింట్లు రోజుకు 4.2 గ్లాసుల ప్లెయిన్ వాటర్ తీసుకున్నట్టు వెల్లడైంది. వాళ్ల గరిష్ట కాలరీ ఇంటేక్ 2,157. వీటిల్లో తీపి డ్రింకులు, కాఫీ, టీలు తాగడం వల్ల శరీరంలో 125 కాలరీలు చేరుతున్నాయి.
అతిగా తాగకూడదు!
కాలరీ-రిచ్ ఆహారం, పోషకాలు తక్కువుగా ఉండే ఫుడ్స్ అంటే snacks, పేస్ట్రీస్, డిజర్టులు తినడం వల్ల శరీరంలోకి 432 కాలరీలు వచ్చి చేరుతున్నాయి. అయితే మంచినీళ్లు ఎక్కువగా తాగిన వాళ్లల్లో డెయిలీ కాలరీలు 68 నుంచి 2005 వరకూ తగ్గుతున్నాయి. అలా అని ఎక్కువ నీరు తాగడం కూడా శరీరానికి మంచిది కాదు. అలా చేయడం వల్ల శరీరంలో పోషకాలు, nutrients బయటకు పోయే ప్రమాదం ఉంది. శరీరంలో నిస్సత్తువుగా మారుతుంది. శరీరంలోని ప్లూయిడ్స్ పలచబడిపోతాయి.

దీంతో శరీరంలో సోడియం ప్రమాణాలు పడిపోతాయి. కణాలు వస్తాయి. చివరిగా స్పృహ కోల్పోతాం. ఫిట్లు వస్తాయి. కోమాలోకి పోయే ప్రమాదం ఉంది. అందుకే శరీర తీరు, diet, వయసు ఇతర విషయాల కనుగుణంగా వైద్యుని సూచనలతో నీరును తాగాలి. అందరికీ ఒకే రకమైన శారీరక లక్షనాలు, జీవక్రియ ఉండకపోవడం ఇందుకు కారణం.