6 lane highway

6 lane highway:మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌కు మ‌హార్ధ‌శ వచ్చెనే!

Telangana

6 lane highway: మ‌హ‌బూబ్ న‌గ‌ర్ – రాయ‌చూర్ మీదుగా 6 లేన్ హైవే నిర్మాణం కానుంది. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా గ‌ద్వాల మీదుగా క‌ర్ణాట‌క‌లోకి కోస్గీ, రాయ‌చూర్‌, మ‌హారాష్ట్ర‌లోని షోలాపూర్‌, నాసిక్ మీదుగా చెన్నై ఎక‌న‌మిక్ కారిడార్ కు అనుసంధానం చేయ‌నున్నారు. రాష్ట్ర స‌రిహ‌ద్దుల నుంచి మ‌రో ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం కానుంది. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా గ‌ద్వాల రోడ్ నుంచి క‌ర్ణాట‌క‌లోని రాయ‌చూర్ మీదుగా ఈ జాతీయ ర‌హ‌దారిని నిర్మాణం(6 lane highway) చేయ‌నున్నారు.

ఇక్క‌డ నుంచి దీన్ని చెన్నై ఎక‌న‌మిక్ కారిడార్‌ను అనుసందానం చేయ‌నున్నారు. చెన్నై- సూర‌త్ ఎక్స్‌ప్రెస్ హైవేకు నిధులు మంజూరు చేసిన‌ట్టు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ట్విట్ట‌ర్ ద్వారా మంగ‌ళ‌వారం వెల్ల‌డించారు. తెలుగు రాష్ట్రాల‌ను అనుసంధానం చేస్తూ ఈ 6 లేన్ ర‌హ‌దారిని నిర్మాణం చేయ‌నున్నారు. గ‌తంలోనే దీనికి సంబందించిన గెజిట్ కూడా జారీ అయ్యింది. గ‌తేడాది(2021) అక్టోబ‌ర్ లో కేంద్రం గెజిట్ జారీ చేయ‌గా, తాజాగా నిధులు కేటాయించిన‌ట్టు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కారీ వెల్ల‌డించారు.

150(సీ) నేష‌న‌ల్ హైవేను షోలాపూర్ – క‌ర్నూల్‌- చెన్నై ఎక‌న‌మిక్ కారిడార్‌గా అనుసంధానించ‌నున్నారు. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా గ‌ద్వాల మీదుగా క‌ర్ణాట‌క‌లోకి కోస్గీ, రాయ‌చూర్‌, మ‌హారాష్ట్ర‌లోని షోలాపూర్‌, నాసిక్ మీదుగా చెన్నై ఎక‌న‌మిక్ కారిడార్‌కు అనుసంధానం చేయ‌నున్నారు. ఈ రోడ్డు రాష్ట్రంలోకి 65 కిలోమీట‌ర్లు ఉండ‌నుంది. ఈ హైవే నిర్మాణం మొత్తం 1416 కిలోమీట‌ర్లు, భార‌త్‌మాల ప‌రియోజ‌న ప‌థ‌కంలో భాగంగా చేప‌ట్టిన ఈ ఎక్స్‌ప్రెస్ హైవేకు రూ.972.06 కోట్లు విడుద‌ల చేసిన‌ట్టు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కారీ మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *