Congress party లోకి 400 కుటుంబాలు చేరిక | TRS Partyకి షాక్!
Congress party : ఖమ్మ నగరంలోని మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా నగరంలోని 49వ డివిజన్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కనేతృత్వంలో టిఆర్ఎస్ పార్టీ నుండి దుద్దుకూరు వెంకటేశ్వర్లు సారథ్యంలో ఆదివారం 400 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా భట్టి విక్కమార్క కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని ఆలోచనతో పార్టీలోకి రావడం మంచి ఆలోచనని అన్నారు. ఈ సందర్భంగా దుద్దుకూరి వెంకటేశ్వర్లుని అభినందించారు. మిగతా రాజకీయ పార్టీల్లో వాడుకొని వ్యాపారం చేయడం తప్ప ప్రజలకు సేవ చేసే ఉద్ధేశం లేదని అన్నారు.


కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ప్రజలకు అందేవని, అనేక అభివృద్ధి పనులు చేశామని అన్నారు. కాంగ్రెస్ పరిపాలనను చూసి ప్రజలు ఆకర్షితులై టిర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలని కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. దుద్దుకూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఖమ్మం నగరంలోని 49వ డివిజన్ లో అందరివాడిగా ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నానని హామీ ఇచ్చారు. నిన్నటి వరకు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న తనకు ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోవడం ప్రజామోదం, ప్రజల ఆకాంక్షలు వారి కోరిక మేరకు మధిర ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క సమక్షంలో పార్టీలో చేరి కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్నట్టు తెలిపారు. గత ఐదు సంవత్సరాల క్రితం టిఆర్ఎస్ పార్టీ ఆదేశానుసారం ఆనాటి 34 డివిజన్లో తన భార్యను పోటీ చేయించి కేవలం 14 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చెందడం జరిగిందన్నారు.


తన డివిజన్ కాకపోయినా పార్టీ బలోపేతం లక్ష్యంగా కృషి చేసిన పార్టీ తన సేవలను గుర్తించకుండా టికెట్ ఇవ్వకపోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో తన భార్య ఉషారాణి ఓటమికి కొందరి పాత్ర ఉందని ఆరోపించారు. గత 25 ఏళ్లుగా సేవే లక్ష్యంగా పనిచేస్తున్నానని తనకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలని, 49వ డివిజన్ లో విజయం చేకూరే విధంగా ప్రజలు సహకరించాలని దుద్దుకూరి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, నగర అధ్యక్షులు ఎం.డి జావిద్, మాజీ కార్పొరేటర్లు నాగండ్ల దీపక్ చౌదరి, వడ్డెబోయిన నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court