30 years industry prudhvi raj | తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్‌గా, విలన్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్(prudhvi raj) సోషల్ మీడియా వేదిక ద్వారా సంచలన కామెంట్లు చేశారు. ఇప్పటి వరకు రాజకీయాల అంటూ తిరిగి చివరకు సినిమా పరిశ్రమకు దూరమయ్యాయని పశ్చాతప పడ్డారు. నా బోటి వాడికి రాజకీయాలు అనవసరమని, ఇప్పటి వరకు తాను మోసపోయానని, ఆర్థికంగా నష్టపోయానని ఆవేదనతో ఓ వీడియో రిలీజ్ చేశారు.
30 years industry prudhvi raj
పృథ్వీరాజ్ మాట్లాడుతూ రాజకీయంలో కొనసాగాలంటే బ్యాగ్రౌండ్ ఉండాలని, నాకు అది లేదని, నేను కష్టపడి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమ(tollywood)కు వచ్చానని అన్నారు. నన్ను మెగస్టార్ చిరంజీవి, మెగా ఫ్యామిలీ ఆదుకుందని తెలిపారు. నా బంధువులు నన్ను వదిలి వేశారని, బంధువులను నేను నమ్మను అని, సిని పరిశ్రమలో ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకు ఎవ్వరూ అవకాశం ఇవ్వడం లేదని బహిరంగా చెప్పేశారు.
నేను రాజకీయాల్లోకి వెళ్లి సాధించింది ఏమీ లేదని, తనకు పెద్ద గుణపాఠం వచ్చిందని పృధ్వీరాజ్ అన్నారు. నేను రాజకీయాల్లో మెగా ఫ్యామిలీపై విమర్శలు చేసినా, పార్టీ తరపున తన కష్టపడినా పార్టీ నన్ను ఆదుకోలేదని, మెగస్టార్ చిరంజీవి ఆదుకున్నారని, సినిమా పరిశ్రమ తనను ఆదుకుందని అన్నారు. తాను అనారోగ్యంగా ఉన్నప్పుడు తనను సినిమా పెద్దలు ధైర్య పరిచి ప్రోత్సాహం అందించారని, ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ తరపున ఉన్న ప్రతి ఒక్క సినిమా ఆర్టిస్టుకు ధన్యవాదాలని తెలిపారు. రాజకీయాలు తనకు సూటు కాలేదని ఇక నుంచి తాను సినిమా పరిశ్రమలోనే ఉంటానని అన్నారు. ఈ సందర్భంగా అశ్వినీదత్, రాఘవేంద్ర రావు, చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు తనను క్షమించాలని కోరారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్‌గా, విలన్‌గా పలు పాత్రలు పోషించి 30 ఇయర్స్ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన పృథ్వీరాజ్ గతంలో వైఎస్సార్సీపీ పార్టీ తరపు ప్రచారంలో పాల్గొన్నారు. జగన్ గెలుపు కోసం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండి మెగా ఫ్యామిలీపై రాజకీయంగా పలు విమర్శలు చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కీలక పదవి కూడా బాధ్యతలు చేపట్టారు. కానీ కొన్ని విమర్శల కారణంగా దానికి రాజీనామా చేశారు. అందుకు పలువురు తన పదవి పోవడానికి వ్యక్తిగతంగా కక్ష గట్టారని, ఆ విధంగా తన పదవి పోయిందని ఆవేదన చెందారు.

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పృథ్వీరాజ్‌కు ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తాను పూర్తిగా రాజకీయాలకు గుడ్‌బై చెప్పినట్టు తెలుస్తోంది. తన వీడియో ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు, పెద్దలను క్షమించమని కోరారు. ముఖ్యమంగా మెగా ఫ్యామిలీ తనను క్షమించాలని కోరారు. ఇక నుంచి తాను చిత్ర పరిశ్రమలోనే ఉంటానని, త్వరలో చిత్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దలందర్నీ కలుస్తానని తెలిపారు. ఇక ఏ పార్టీలోకి వెళ్లనని ఇప్పటి వరకు తాను నష్టపోయినది చాలు అని తనకు బుద్ధి వచ్చిందని పేర్కొన్నారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!