26 New Districts: కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో అడుగు పడింది. గత నెలాఖరున ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాలకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన అభ్యంతరాలు, సలహాలు, సూచలనపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాలు నేటి(బుధవారం) నుండి జరగబోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం అన్ని జిల్లాల్లో కలిపి 2,000 వేలకు పైగా అర్జీలు అందినట్టు తెలిసింది. 1,478 అభిప్రాయాలు, అభ్యంతరాలు వచ్చినట్టు అధికారికంగా ప్రభుత్వానికి సమాచారం (26 New Districts)అందింది.
ప్రజా ప్రతినిధులు, వివిధ ఉద్యోగ, ప్రజా సంఘాల వారు వినతులు ఇస్తున్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 700, తక్కువుగా శ్రీకాకుళం జిల్లాలో 16 విజ్ఞప్తులు అందాయి. అభ్యంతరాల స్వీకరణకు వచ్చే నెల 3దాకా గడువున్నా ముందుగానే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుండటం చర్చనీయాంశమైంది. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభించేలా సన్నాహాలు సాగుతున్నాయి.
సమావేశాలు ఇలా!
ఏపీలోని 13 జిల్లాల కలెక్టర్లతో బుధవారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు ఈ నాలుగు రోజులు విజయవాడ, తిరుపతి, అనంతపురం, విశాఖపట్నం నగరాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. విజ్ఞప్తుల గురించి ఈ సమావేశాల్లో జిల్లాల కలెక్టర్లు వివరించాలని రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయకుమార్ ఆదేశాలు జారీ చేశారు.
23వ తేదీన విజయవాడలోని కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో, 24వ తేదీన తిరుపతిలో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లతో, 26వ తేదీన అనంతపురంలోని అనంతపురం, కర్నూలు జిల్లాల కలెక్టర్లతో , 28వ తేదీన విశాఖపట్నంలోని విశాఖపట్నం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు ఉంటాయి.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!