2022 funny memes: ఈ నూత‌న సంవ‌త్స‌రం మామూలుగా ఉండ‌దు మ‌రి! (2022 ఫ‌న్నీ వీడియో)

2022 funny memes 2022 నూత‌న సంవ‌త్స‌రం అని మురిసిపోతున్నా..మూల‌న ఒమిక్రాన్ మూలుగుడు శ‌బ్ధాలు మాత్రం భ‌య‌పెడుతూనే ఉన్న‌ట్టుంది ఈ కొత్త సంవ‌త్స‌రాల మార్పులు. 2019 లో ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున్న విడుద‌లైన క‌రోనా వైర‌స్ బాహుబ‌లి-1, బాహుబ‌లి -2 లాగా సంవ‌త్స‌రానికి ఒక‌టి పేర్లు మార్చుకుంటూ ప్ర‌జ‌ల‌పై ప్ర‌తాపం చూపిస్తున్నాయి వైర‌స్‌లు. జ‌నాల్ని పిట్ట‌ల్లాగా రాల్చిన క‌రోనా ఇప్పుడు ఒమిక్రాన్‌గా నూత‌న వేడుక‌ల‌ను మ‌న‌తో పంచుకోవ‌డానికి సిద్ధ‌మైన‌ట్టు ఉంది. 2022 నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల అనంత‌రం మ‌న తెలుగు న్యూస్ ఛాన‌ళ్లు బ్రేకింగ్ న్యూస్ తెర మారుస్తూ అక్క‌డ 100 ఒమిక్రాన్ కేసులు, ఇక్క‌డ 500 ఒమిక్రాన్ కేసులు అంటూ టీవీ ఎదుట కూర్చున్న వారికి గుండెపోటు వ‌చ్చే వార్త‌లు చెప్ప‌డం ఖాయం. ఇది ఎలా ఉన్నా..! త‌ర్వాత ముచ్చ‌ట‌గానీ ఇప్పుడు యూట్యూబ్‌లో మాత్రం 2022 సంవ‌త్స‌రం గురించి ఫ‌న్నీ మీమ్స్( funny memes) వీడియో ఒక‌టి మాత్రం న‌వ్వులు(2022 funny memes) తెప్పిస్తుంది.

దాని సారాంశం ఏమిటంటే?

క్రికెట్ గ్రౌండ్‌లో 2020, 2021 అనే మీమ్స్ గ‌ల చిత్రాలు ఉంటాయి.ఈ లోపు బాజా భ‌జయింత్రీల‌తో కొన్ని మీమ్స్ అన్నీ డ్యాన్సులు వేసుకుంటూ చాలా సంతోషంగా 2022 అనే మీమ్స్‌ను ఊరిగేస్తూ గ్రౌండ్‌లోకి ఎంట‌ర్ అవుతాయి. వీళ్ల సంతోషాన్ని 2020, 2021 మీమ్స్ చూస్తూ ఇద్ద‌రు మొఖాలు చూసుకుంటాయి. వెంట‌నే తెర‌పైన బ్రేకింగ్ న్యూస్ అని ప‌డుతుంది.

ఒక కుర్చీ పైన 2021, 2022 సంవ‌త్స‌రాల మీమ్స్ చిత్రాలు కూర్చుని ఉంటాయి. 2021 మీమ్స్ పేప‌ర్ చ‌దువుతుంది. ఆ పేప‌ర్‌లో న్యూ వేరియంట్ డిటెక్టడ్ ఒమిక్రాన్(New variant detector Omicron) అని ఉంటుంది. అది చూసి 2021 మీమ్స్ పేప‌ర్ చ‌దువుతూ ఒక్క‌సారిగా కుప్ప‌కూలుతుంది. దీనిని అక్క‌డ ఉన్న కొన్ని మీమ్స్ చూస్తాయి. వెంట‌నే 2021 మీమ్స్‌ను ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌తాయి. ఆ పేప‌ర్‌ను ప‌క్క‌నే ఉన్న 2022 సంవ‌త్స‌రం మీమ్స్ చ‌దువుతుంది. అందులో Omicron will Spread More Rapidly అని ఉంటుంది. అది చూసి ఒక్క‌సారిగా 2022 కింద ప‌డుతుంది. అంటే దీని అర్థం 2022 కూడా ఒమిక్రాన్ కేసుల‌తో ప్ర‌జ‌ల‌ను అల్లాడించే ప‌నిలో ఉంద‌ని తెలుస్తోంది.

వీడియో లింక్ కోసం: ఇక్క‌డ క్లిక్ చేయండి!

Share link

Leave a Comment