మ‌రో అల్ప‌పీడ‌నం...తెలంగాణ‌కు మ‌రో టెన్ష‌న్‌..!


హైద‌రాబాద్‌:
 తూర్పు మ‌ధ్య అరేబియా స‌ముద్రం మ‌రియు ఆనుకొని ఉన్న ఈశాన్య అరేబియా స‌ముద్రం ప్రాంతాల‌లో కొన‌సాగుతున్న తీవ్ర అల్ప‌పీడ‌నం  శ‌నివారం ఉద‌యం 8.30 గంట‌ల‌కు వాయుగుండంగా మారి అదే ప్రాంతంలో వెరావ‌ల్‌(గుజ‌రాత్‌) కు ద‌క్షిణ నైరూతి దిశ‌గా 380 కిలోమీట‌ర్లు, ముంబైకు ప‌శ్చిమ వాయువ్య దిశ‌గా 440 కిలోమీట‌ర్లు, స‌ల‌లాహ‌(ఒమ‌న్‌)కు తూర్పు ఈశాన్య దిశ‌గా 1600 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృత‌మై ఉన్న‌ది. ఇది రానున్న 48 గంట‌ల‌లో ప‌శ్చిమ దిశ‌గా ప్ర‌యాణించి క్ర‌మేపీ బ‌ల‌హీన ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. 

ద‌క్షిణ ఆంధ్ర‌ప్ర‌దేశ్ తీరానికి ద‌గ్గ‌ర‌లో ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతం ప్రాంతంలో 5.8 కిలోమీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం ఏర్ప‌డింది. మ‌ధ్య బంగాళాఖాతం ప్రాంతంలో సుమారుగా అక్టోబ‌ర్ 19వ తేదీన అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది త‌దుప‌రి 24 గంట‌ల‌లో ఇది మ‌రింత బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంది. అక్క‌డ‌క్క‌డ ఉరుములు, మెరుపుల‌తో పాటు తేలిక‌పాటి నుంచి భారీ , మోస్త‌రు వ‌ర్షాలు ప‌లు చోట్ల ప‌డే అవ‌కాశం ఉంద‌ని  వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. 


Post a Comment

0 Comments