విడాకుల‌పై 'సుప్రీం' సంచ‌ల‌న తీర్పు..!

న్యూఢిల్లీ: గ‌తంలో ఒక మ‌హిళ ఇష్ట‌పూర్వ‌కంగా వేరే వ్య‌క్తితో శారీర‌క సంబంధం పెట్టుకుంటే అది నేరం కింద ప‌రిగ‌ణ‌లోకి రాదు..అంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. కీల‌క విష‌యాల్లో కీల‌క తీర్పులు వెలువ‌రిస్తున్న సుప్రీం కోర్టు దేశ ప్ర‌జ‌లంద‌రికీ ఒకింత ఆశ్చ‌ర్యానికి గురిచేసే తీర్పు మ‌రోసారి దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం తీర్పు వెలువ‌రించింది. 


సాధార‌ణంగా అయితే భ‌ర్త‌ల బంధం మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు ఏర్ప‌డిన‌ప్పుడు విడాకులు తీసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. లాయ‌ర్‌ను సంప్ర‌దించి కోర్టు స‌మ‌క్షంలో విడాకులు తీసుకున్న త‌ర్వాత ఎవ‌రి దారి వారు చూసుకుంటారు. ఇక మ‌హిళ‌లు అత్త‌వారింట్లో ఉండ‌కుండా పుట్టింట్లో ఉండ‌టం లేదా వేరే ఉండ‌టం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ భ‌ర్త‌తో విడిపోయి అత్త‌మామ‌ల‌తో ఉండాలి అని అనుకున్న‌ప్పుడు సాధ‌ర‌ణంగా అలాంటి అవ‌కాశం ఉండ‌దు. మ‌హిళ‌లు అత్త‌వారింట్లో నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తూ ఉంటారు. ఇదే విష‌యంపై ఇటీవ‌ల విచార‌ణ జ‌రిపిన సుప్రీం కోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 


భ‌ర్త‌తో వివిద కార‌ణాల‌తో విడిపోయి విడాకులు తీసుకున్న‌ప్ప‌టికీ కూడా మ‌హిళ‌కు అత్త‌వారింట్లో నివ‌సించే హ‌క్కు ఉంటుంది అంటూ.. ఇటీవ‌ల దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం తీర్పును వెలువ‌రించింది. త‌మ కొడుకుతో విడాకులు తీసుకుని విడిపోయిన‌ప్ప‌టికీ త‌మ కోడ‌లు ఇంకా త‌మ ఇంట్లోనే ఉంటుంద‌ని అంటూ స‌తీష్ అనే వ్య‌క్తి ఇటీవ‌లే సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా దీనిపై విచారించిన సుప్రీం కోర్టు మ‌హిళ‌ల‌కు భ‌ర్త నుంచి విడిపోయిన‌ప్ప‌టికీ అత్త‌వారింట్లో ఉండే హ‌క్కు ఉంటుంది అంటూ..స్ప‌ష్టం చేసింది. సుప్రీం కోర్టు వెలువ‌రించిన తీర్పు ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. 

ఇవి చ‌ద‌వండి : మ‌రో అల్ప‌పీడ‌నం..తెలంగాణ‌కు మ‌రో టెన్ష‌న్‌..!

ఆచార్య చాణిక్య నీతి : ఈ విష‌యాలు ఎట్టి ప‌రిస్థితుల్లో ఎవ్వ‌రికీ చెప్ప‌వ‌ద్దు..!

Post a Comment

0 Comments