ఉపాధి కోసం తెచ్చుకుంటే ప్రాణం తీసింది..!

సంగారెడ్డి : ఉపాధినిమిత్తం తెచ్చుకున్న హార్వెస్ట‌ర్ (నూర్పిడి) యంత్రం య‌జ‌మాని పాలిట య‌మ‌గండంగా మారింది. ఈ సంఘ‌ట‌న సంగారెడ్డి జిల్లా కంగ్టి మండ‌ల కేంద్రంలో చోటు చేసుకుంది. మండ‌ల కేంద్ర‌మైన కంగ్టికి చెందిన బాలాజీ(35) అనే యువ‌కుడు నూర్పిడి యంత్రంతో ఉపాధి పొందుతున్నాడు. పెస‌ర‌, కంది, సోయా, జొన్న త‌దిత‌ర పంట‌ల‌ను నూర్పిడి చేస్తూండేవాడు. ఇటీవ‌ల నూత‌నంగా అధునాత నూర్పిడి యంత్రం తెచ్చాడు. దాని ద్వారా ఉపాధి  పొందుతున్నాడు. యంత్రానికి  ట్రాక్ట‌ర్‌కు అనుసంధానం చేసి రైతుల పొలాల వ‌ద్ద‌కు వెళ్లి సోయా పంట నూర్పిడి చేసేవారు. ఈక్ర‌మంలో సోమ‌వారం కంగ్టిలో సోయా నూర్పిడి చేస్తున్నారు. యంత్రంపై నిలుచుండి సోయా పైరు అందిస్తున్న క్ర‌మంలో ప్ర‌మాద‌వ‌శాత్తూ యంత్రంలో ప‌డిపోయాడు. గ‌మ‌నించిన ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ యంత్రం నిలిపివేశాడు. అప్ప‌టికే యువ‌కుడు ప్రాణాలు వ‌దిలాడు. 


Post a Comment

0 Comments