రైతుకు దొరికిన వ‌జ్రం..ఆందోళ‌న‌తో సందిగ్ధం..!

ఓ రైతుకు పొలంలో ఓ అరుదైన రాయి దొరికింది. అది వ‌జ్రం కావ‌చ్చ‌ని ఆయ‌న ఓ లేబ‌రేట‌రీలో ప‌రీక్ష‌లు చేయించారు. అది వ‌జ్ర‌మేన‌ని వారు  ధృవీక‌రించారు. 

రంగారెడ్డి:  తెలంగాణ రాష్ట్రంలో ఓ రైతుకు త‌న పొలంలో భారీ వ‌జ్రం దొరికిన విష‌యం ఆల‌స్యంగా వెలుగు చూసింది.కృష్ణా ప‌రీవాహ‌క ప్రాంతంలో వ‌జ్రాలు , బంగారు నిక్షేపాలు ఉన్నాయంటూ జియలాజిక‌ల్ స‌ర్వే ఇండియా(జీఎస్ఐ) గ‌తంలో చేసిన ప్ర‌క‌ట‌న‌కు దీంతో బ‌లం చేకూరింది. రంగారెడ్డి జిల్లా ఆమ‌న‌గ‌ల్ మండ‌లానికి చెందిన ఓ రైతు పొలంలో భారీ ప‌రిమాణంలో వ‌జ్రం దొరికింది.  స‌ద‌రు రైతు బాగా చ‌దువుకున్న‌వాడు కావ‌డంతో గుట్టు చ‌ప్పుడు కాకుండా ఆ రాయిని హైద‌రాబాద్ ల్యాబ్‌లో ప‌రీక్ష‌లు చేయించాడు. ప‌రీక్ష‌లో అది వజ్ర‌మేన‌ని తేలింద‌ని కథ‌నంలో రాశారు. 

అంత‌టితో సంతృప్తి చెంద‌ని స‌ద‌రు రైతు.. ల్యాబ్ నివేదిక‌ను వ‌జ్ర నిక్షేపాల‌పై అధ్య‌య‌నం చేసిన ప్రొఫెస‌ర్‌కు చూపించాడు. ప్రొఫెస‌ర్‌కూడా అది వ‌జ్ర‌మేన‌ని నిర్థారించాడు. 

ఆందోళన‌లో రైతు..

 ఈ విష‌యం బ‌య‌టికి వ‌స్తే త‌న భూమిని ప్ర‌భుత్వం ఎక్క‌డ  స్వాధీనం చేసుకుంటుందోనన్న ఆందోళ‌న చెందిన రైతు.. దాన్ని బ‌య‌ట పెట్టొద్దంటూ ఆ ప్రొఫెస‌ర్‌ను వేడుకున్నాడ‌ని ఓ ప‌త్రిక తెలిపింది. ఈ నెల మొద‌టి వారంలో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది. నాలుగు శ‌తాబ్ధాల కింద‌టే మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా క‌ల్వ‌కుర్తిలో వ‌జ్రాల నిక్షేపాలు ఉన్న‌ట్టు చారిత్ర‌క ఆధారాలు దొర‌క‌డంతో జీఎస్ఐ ఆధ్వ‌ర్యంలో ప‌దేళ్ల పాటు స‌ర్వే చేశారు. ఈ స‌ర్వే లో ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌, న‌ల్గొండ జిల్లాలోని కృష్ణా ప‌రీవాహ‌క ప్రాంతంలో వ‌జ్రాలు, బంగానికి సంబంధించిన నిక్షేపాలు ఉన్నాయ‌ని తేలింది. 


ఆయా జిల్లాల్లో ఏయే ప్రాంతాల్లో ఉన్నాయో మ్యాపులు సైతం ఖ‌రారు చేశారు. దీనిపై ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యానికి చెందిన జియో ఫిజిక్స్ విభాగం ప్రొఫెస‌ర్లు అధ్య‌య‌నం చేశారు.  న‌ల్గొండ జిల్లాలోని రామ‌డుగు, చండూరు, గుర్రంపోడులో వ‌జ్ర నిక్షేపాలు ఉన్నాయ‌ని, మిర్యాల‌గూడ ‌స‌మీపంలో ఉట్ల‌ప‌ల్లి త‌దిత‌ర ప్రాంతాల్లోనూ రాంప్రెంట్స్ (ద్వితీయ శ్రేణి న్యాణ‌త క‌లిగిన‌) వ‌జ్రాలు నిక్షేపాలు ఉన్న‌ట్టు ప్రొఫెస‌ర్లు నిర్థారించారు. ఇక్క‌డ జీఎస్ఐ స‌ర్వే చేయాల‌ని ఉస్మానియా యూనివ‌ర్శిటీ ప్రొఫెస‌ర్లు కేంద్రానికి నివేదిక ఇచ్చారు. 

ఇవి చ‌ద‌వండి : వింత‌లో ఇదో ర‌కం..భూమిని చీల్చుకొని పైకొచ్చిన సిమెంట్ వ‌ర‌లు

అన్‌లాక్ 5.0 గైడ్ లైన్స్ తెలుసుకోండి..!

Post a Comment

0 Comments