తెర‌వ‌డం క‌ష్ట‌మే..రాష్ట్రాల క‌స‌ర‌త్తు..!


ఢిల్లీ :
క‌రోనా వైర‌స్ ప్ర‌భావం దేశ‌వ్యాప్తంగా దాదాపు అన్ని రంగాల‌పై ప‌డింది. ముఖ్యంగా గ‌త మార్చి నెల నుంచి విద్యా సంస్థ‌ల‌న్నీ మూత‌బ‌డే ఉన్నాయి. వ్య‌వ‌స్థ‌ల‌ను గాడిలో పెట్ట‌డంలో భాగంగా జూన్ 8 నుంచి కేంద్ర ప్ర‌భుత్వం అన్‌లాక్ ప్ర‌క్రియ‌ను కొన‌సాగిస్తోంది. తాజాగా అన్‌లాక్ 5.0 మార్గ‌ద‌ర్శ‌కాల్లో భాగంగా అక్టోబ‌ర్ 15 నుంచి కంటైన్మెంట్ బ‌య‌ట ఉన్న పాఠ‌శాలు, క‌ళాశాల‌లు, విశ్వ‌విద్యాల‌యాల‌ను తెరుచుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తినిచ్చింది. దీనిపై ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ణ‌యం తీసుకునే వెసులుబాటా ఇచ్చింది. అయితే, వెసులుబాటు ఉన్న‌ప్ప ‌టికీ చాలా రాష్ట్రాలు మాత్రం పాఠ‌శాల‌ల‌ను తిరిగి తెరిచేందుకు వెన‌క‌డుగు వేస్తున్నాయి. ముఖ్యంగా వైర‌స్ తీవ్ర‌త కొన‌సాగుతోన్న దృష్ట్యా ఆయా రాష్ట్రాలు పాఠ‌శాల‌ల‌ను తెరిచేందుకు విముఖ‌త చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఢిల్లీ, క‌ర్ణాట‌క‌, ఛ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రాలు పాఠ‌శాల‌లు ఇప్ప‌ట్లో తెర‌వ‌డం క‌ష్ట‌మ‌ని ప్ర‌క‌టించాయి. గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, గోవా రాష్ట్రాలు కూడా ప్రాథ‌మిక త‌ర‌గ‌తులు దీపావ‌ళిలోపు పునః ప్రారంభించ‌డం క‌ష్ట‌మేన‌ని తేల్చాయి. విద్యాసంస్థ‌లు తిరిగే ప్రారంభించ‌డంపై ఆయా రాష్ట్రాల ఆలోచ‌న ఈ విధంగా ఉంది. 

ఢిల్లీలో..అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు ఇంతే...!

దేశ రాజ‌ధాని ఢిల్లీలో అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు య‌థాద‌త స్థితి కొన‌సాగిస్తామ‌ని నిర్ణ‌యించింది. అనంత‌రం ప‌రిస్థితి స‌మీక్షించి దీనిపై మ‌రోసారి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని పేర్కొంది. 

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ లో 9,10 త‌ర‌గ‌తులు మాత్ర‌మే..!

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్రంలో అక్టోబ‌ర్ 19 పాఠ‌శాల‌ల‌ను తిరిగి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. అయితే, ప్ర‌స్తుతం కేవ‌లం 9,10 వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు మాత్ర‌మే త‌ర‌గ‌తులు ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించింది. క్లాసుల‌ను మాత్రం రెండు షిప్టుల్లో నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని ఉప‌ముఖ్య‌మంత్రి దినేష్ శ‌ర్మ వెల్ల‌డించారు. అంతేకాకుండా పాఠ‌శాల‌ల‌కు వ‌చ్చే విద్యార్థులు త‌మ త‌ల్లిదండ్రుల నుంచి నిర‌భ్యంత‌ర ప‌త్రాన్ని తీసుకురావాల‌ని సూచించింది. 

క‌ర్ణాట‌క‌..తొంద‌రేం లేదు..!

వైర‌స్ తీవ్ర‌త అధికంగా ఉన్న దృష్ణ్యా క‌ర్ణాట‌క‌లో పాఠ‌శాల‌ల‌ను ఇప్ప‌ట్లో తెరిచే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. "విద్యార్థులు ఆరోగ్యం, భ‌ద్ర‌తా మాకు ముఖ్య‌మైంది. ప్ర‌స్తుతానికి విద్యాసంస్థ‌లు తెర‌వ‌డంపై అటు ప్ర‌భుత్వం కానీ, విద్యాశాఖ తొంద‌ర‌ప‌డ‌టం లేదు. దీనిపై అన్ని ర‌కాలుగా చ‌ర్చించిన త‌ర్వాతే ఓ నిర్ణ‌యం తీసుకుంటాం." అని విద్యాశాఖ మంత్రి పురేష్ కుమార్ వెల్ల‌డించారు. 

మ‌హారాష్ట్ర‌లో..దీపావ‌ళి త‌ర్వాతే..!

దేశంలోనే అత్య‌ధికంగా వైర‌స్ తీవ్ర‌త ఉన్న మ‌హారాష్ట్ర‌లోనూ విద్యాసంస్థ‌లు తెర‌వ‌డంపై రాష్ట్ర ప్ర‌భుత్వం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది. దీపావ‌ళి వ‌ర‌కు పాఠ‌శాల‌లు మూసే ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది. "దీపావ‌ళి త‌ర్వాత ప‌రిస్థితుల‌ను మ‌రోసారి అంచ‌నా వేసిన అనంత‌రం విద్యాసంస్థ‌లు తెర‌వ‌డంపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది. దీపావ‌ళి అనంత‌రం ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్‌ఠాక్రే వైర‌స్ తీవ్ర‌త పై స‌మీక్షించి నిర్ణ‌యం తీసుకుంటారు. అంత వ‌ర‌కూ విద్యాసంస్థ‌లు మూసే ఉంటాయి" అని ఉప‌ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ పేర్కొన్నారు. 

ఛ‌త్తీష్‌ఘ‌డ్‌, గుజ‌రాత్‌, మేఘాల‌య రాష్ట్రాల్లోనూ..!

రాష్ట్ర ప్ర‌భుత్వం త‌దుప‌రి ఉత్త‌ర్వులు ఇచ్చేంత వ‌ర‌కు విద్యాసంస్థ‌లు మూసే ఉంటాయ‌ని ఛ‌త్తీష్‌ఘ‌డ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇక‌, దీపావ‌ళి త‌ర్వాతే పాఠ‌శాలు తెర‌వ‌డంపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని గుజ‌రాత్ ప్ర‌భుత్వం పేర్కొంది. అటు మేఘాల‌యా కూడా ఇంక తుది నిర్ణ‌యం తీసుకోలేదు. ఇప్ప‌టికే విద్యాసంస్థ‌ల పునః ప్రారంభంపై అక్క‌డి త‌ల్లిదండ్రుల అభిప్ర‌యాల‌ను తీసుకుంది. అయితే, అక్టోబ‌ర్ 15 నుంచి 6,7,8 త‌ర‌గ‌తుల‌తో పాటు తొమ్మిది, ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు కేవ‌లం వారి విష‌యం సందేహాల‌ను నివృత్తి చేసుకునేందుకు పాఠ‌శాల‌ల‌కు అనుమ‌తిస్తామ‌ని పేర్కొంది. 

పుదుచ్చేరిలో ఒక పూట మాత్ర‌మే..!

విద్యా సంస్థ‌ల‌ల‌ను తిరిగి ప్రారంభించ‌డంలో పుదుచ్చేరి కాస్త ముందు వ‌రుస‌లో ఉంది. తొమ్మిది నుంచి 12 వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు తిరిగి త‌ర‌గ‌తుల‌ను అక్టోబ‌ర్ 8 నుంచే ప్రారంభించింది. అయితే, వీరికి కేవ‌లం ఒక పూట మాత్ర‌మే త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తామ‌ని పుదుచ్చేరి విద్యాశాఖ డైరెక్ట‌ర్ రుద్ర గౌడ్ వెల్ల‌డించారు. విద్యార్థులు రోజు విడిచి పాఠ‌శాల‌ల‌కు రావాల‌ని సూచించింది. హ‌రియాణా ప్ర‌భుత్వం కూడా ఆరు నుంచి తొమ్మిదో త‌ర‌గ‌తుల వ‌ర‌కు పునః ప్రారంభంపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు.

ఏపీ, బెంగాళ్ రాష్ట్రాల్లో న‌వంబ‌ర్ వ‌ర‌కు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కూడా న‌వంబ‌ర్ 2 వ‌ర‌కు పాఠ‌శాల‌ల‌ను ప్రారంభించ‌మ‌ని పేర్కొంది. రాష్ట్రంలో పాఠ‌శాల‌లు తిరిగి ప్రారంభించ‌డంపై న‌వంబ‌రు నెల మ‌ధ్య‌లో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ స్ప‌ష్టం చేశారు. ఇలా దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభిస్తోన్న వేళ పాఠ‌శాల‌ల‌ను తిరిగి ప్రారంభించ‌డంపై ఆయా రాష్ట్రాలు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఇప్ప‌టికే కొన్ని పాఠ‌శాల‌లు ఆన్‌లైన్ లో బోధించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, పాఠ‌శాల‌లు పునః ప్రారంభ‌మైన త‌ర్వాత తీసుకో వాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రొసీజ‌ర్స్  సిద్ధం చేసుకోవాల‌ని కేంద్రం ప్ర‌భుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు ఇప్ప‌టికే సూచించింది. 


Post a Comment

0 Comments