ట్రంప్ కోలుకోవాలి దేవుడా..! కిమ్ ప్రార్థ‌న‌..!

కోవిడ్ కి చికిత్స ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న అమెరికా అధ్య‌క్షుడు..!


వాషింగ్ట‌న్‌: క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస్ప‌త్రిలో చేరారు. వాషింగ్ట‌న్ శివారు ప్రాంతం బెథేస్డాలో  ఉన్న వాల్ట‌ర్ రీడ్ మిలిట‌రీ ఆస్ప‌త్రిలో ఆయ‌న‌కు ప్ర‌త్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది. త‌న‌కు వైర‌స్ సోకిన‌ట్టు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి శ్వేత సౌధంలోనే క్వారంటైన్‌లో ఉన్న ఆయ‌న వైద్యుల సూచ‌న మేర‌కు శుక్ర‌వారం సాయంత్రం ఆస్ప‌త్ర‌లిలో చేరేందుకు అంగీక‌రించారు. మాస్కు ధ‌రించి హెలికాప్ట‌ర్ లో ఆస్ప‌త్రికి చేరుకున్నారు. అక్క‌డి నుంచే ఆయ‌న విధులు నిర్వ‌ర్తిచ‌నున్న‌ట్టు అధికారులు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతానికి ఎన్నిక‌ల ప్ర‌చారానికి పూర్తిగా దూరంగా ఉండే అవ‌కాశం ఉంద‌న్నారు. 

వీడియో ట్విట్ చేసిన ట్రంప్‌..

తాను, ప్ర‌థ‌మ మ‌హిళ మెల‌నియా ట్రంప్ ఆరోగ్యంగా ఉన్న‌ట్టు ట్రంప్ తెలిపారు. వాల్ట‌ర్ రీడ్‌కు చేరుకునే ముందు 18 సెక‌న్ల నిడివి గ‌ల ఓ వీడియోను ట్వీట్ చేశారు. నాకు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న ప్ర‌తిఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు. నేను వాల్ట‌ర్ రీడ్ ఆస్ప‌త్రికి వెళ్తున్నాను. నాకు తెలిసి నేను బాగానే ఉన్నాను. అయినా, అన్నీ స‌వ్యంగా ఉండాల‌నే మేం ఆస్ప‌త్రికి వెళ్తున్నాం. ప్ర‌థ‌మ మ‌హిళ కూడా బాగానే ఉంది. అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. నేను ఇది ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. అని వీడియో సందేశంలో ట్రంప్ అన్నారు.

ట్రంప్ కోలుకోవాల‌ని కిమ్ ఆకాంక్ష‌..!

ట్రంప్ దంప‌తులు క‌రోనా నుంచి త్వ‌రగా బ‌య‌ట‌ప‌డాలంటూ ప్ర‌పంచ‌వ్యాప్తంగా సానుభూతి వ్య‌క్తం అవుతోంది. తాజాగా ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ సైతం ట్రంప్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు." ట్రంప్ దంప‌తుల ఆరోగ్యం ప‌ట్ల కిమ్ సానుభూతి వ్య‌క్తం చేవారు. వీలైనంత త్వ‌ర‌గా వాళ్లు దీని నుంచి బ‌య‌ట‌ప‌డ‌తార‌ని ఆకాంక్షించారు. త్వ‌ర‌లో వారు క‌రోనాను క‌చ్చితంగా జ‌యిస్తార‌న్నారు. "అని అక్క‌డి అధికారిక మీడియా కేసీఎన్ఏ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇప్ప‌టికే ప్ర‌పంచ దేశాల అధినేత‌లు ట్రంప్ దంప‌తుల ఆరోగ్యంపై సానుభూతి సందేశాలు పంపిన విష‌యం తెలిసిందే. 

ట్రంప్ తీసుకుంటున్న చికిత్స ఏమిటి?

కోవిడ్‌-19 నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ట్రంప్ తీసుకుంటున్న చికిత్స విష‌యంలో ఔష‌ధాల జాబితాను ఆయ‌న వ్య‌క్తిగ‌త వైద్యుడు డాక్ట‌ర్ సీన్‌కాన్లే వెల్ల‌డించారు. అధ్య‌క్షుడికి వైర‌స్ సోకిన‌ట్టు పీసీఆర్‌లో నిర్థార‌ణ అయిన త‌ర్వాత‌, ముందు జాగ్ర‌త్త‌గా రెజెనెరాన్స్‌కు చెందిన 8 గ్రాముల డోసు గ‌ల పాలీక్లోన‌ల్ యాంటీబాడీ కాక్‌టెయిల్ తీసుకున్నారు. దీంతో పాటు జింక్‌, విట‌మిన్‌-డి, ఫామోనిటిడైన్‌, ఆస్పిరిన్‌, మెల‌టోనిక్ తీసుకుంటున్నారు. అని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. పాలీక్లోనల్ యాంటీబాడీ కాక్‌టెయిల్ ప్ర‌స్తుతం ప్ర‌యోగాత్మ‌క ద‌శ‌లోనే ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇది కోవిడ్ ల‌క్ష‌ణాలు మ‌రింత ముద‌ర‌కుండా రక్షిస్తుంద‌ని భావిస్తున్నారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నానికి కొంత అలిసిన‌ట్టు క‌నిపించినా  ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నార‌ని వెల్ల‌డించారు. వైద్య‌నిపుణుల బృందం నిరంత‌రం ఆయ‌న ఆరోగ్యాన్ని ప‌ర్య‌వేక్షిస్తోంద‌న్నారు. త‌దుప‌రి తీసుకోవాల్సిన అత్యుత్త‌మ చికిత్సా విధానాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సిఫార్సు చేస్తుంద‌న్నారు. ప్ర‌థ‌మ మ‌హిళ‌కు స్వ‌ల్ప త‌ల‌నొప్పి, దగ్గు మిన‌హా పెద్ద ల‌క్ష‌ణాలేమీ లేవ‌ని తెలిపారు. మిగ‌తా కుటుంబ స‌భ్యులంద‌రికీ నెగెటివ్ వ‌చ్చిన‌ట్టు వెల్ల‌డించారు. 

ఇవి చ‌ద‌వండి :12 సార్లు భూ ప్ర‌కంప‌న‌లు..ఎక్క‌డంటే?

యోగీజీ..ఎందుకు ఇంత నిర్ల‌క్ష్యం..!?Post a Comment

0 Comments