పెరుగుతున్న వ‌ర‌ద ఉధృతి..కృష్ణ న‌ది ప్రాంతం అప్ర‌మ‌త్తం..!


విజ‌య‌వాడ‌:
తెలంగాణ‌, కృష్ణా ప‌రివాహ‌క ప్రాంతాల్లో వ‌ర్షాలు కార‌ణంగా పులిచింత‌ల ప్రాజెక్టుకు వ‌ర‌ద‌నీరు చేరుతోంది. ప్ర‌కాశం బ్యారేజీ ఎగువ‌న గ‌ల పులిచింత‌ల ప్రాజెక్టు నుంచి వ‌చ్చే వ‌ర‌ద ప్ర‌వాహం ప్ర‌స్తుతం 2,50,000 క్యూసెక్కులు. ఆ వ‌ర‌ద ప్ర‌వాహం క్ర‌మేణా పెరిగి 3 ల‌క్ష‌ల నుంచి 3.5 ల‌క్ష‌ల క్యూసెక్కుల‌కు పెరిగి ప్ర‌కాశం బ్యారేజీకి చేరుకునే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా అవ‌స‌ర‌మైన ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, ప్ర‌కాశం బ్యారేజీ దిగువ ప్రాంతాల లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని  కృష్ణ జిల్లా క‌లెక్ట‌ర్ ఎయండి ఇంతియాజ్ వ‌ర‌ద ప్ర‌భావిత మండ‌లాల అధికారుల‌కు అప్ర‌మ‌త్తం చేశారు. కృష్ణాన‌ది ప‌రీవాహ‌క ప్రాంత ప్ర‌జ‌లు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కోరారు. బోట్లు, మోట‌ర్ బోట్లు, స్టీమ‌ర్ల‌తో న‌దిలో ప్ర‌యాణింవ‌ద్ద‌ని, వ‌ర‌ద నీటిలో ఈత‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. 

Post a Comment

0 Comments