ఈ ప‌థ‌కంతో గ్రామీణ ప్రాంత పౌరుల‌కు మేలు...!


న్యూఢిల్లీ :
గ్రామీణ ప్ర‌జ‌ల‌కు సాధికార‌త క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా తీసుకొచ్చిన స్వామిత్వ ప‌థ‌కంలో భాగంగా ల‌బ్ధిదారుల‌కు ప్రాప‌ర్టీ కార్డుల‌ను అంద‌జేసే కార్య‌క్ర‌మాన్ని దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్రారంభించారు.వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఆరు రాష్ట్రాల్లో కార్డుల పంపిణీ మొద‌లు పెట్టారు. అనంత‌రం ల‌బ్ధిదారుల‌తో ముచ్చ‌టించారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివ‌సిస్తోన్న కోట్లాది మంది పౌరుల‌కు ఈ ప‌థ‌కం ద్వారా సాధికార‌త క‌ల్పించ‌నుంది కేంద్రం. గ్రామ‌స్థులు వారి భూముల‌ను ఆర్థిక ఆస్తులుగా ప‌రిగ‌ణించి రుణాలు, ఇత‌ర ప్ర‌యోజ‌నాలు పొందేందుకు మార్గం సుగ‌మం కానుంది. ఈ కార్య‌క్ర‌మం ద్వారా సుమారు ల‌క్ష మంది ల‌బ్ధిదారులు వారి ప్రాప‌ర్టీ కార్డుల‌ను ఎస్ఎమ్ఎస్ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవ‌కాశం ల‌భించ‌నుంది. అనంత‌రం ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్రాప‌ర్టీ కార్డుల‌ను ద‌స్తావేజుల రూపంలో అంద‌జేస్తాయి. ఈ ప‌థ‌కం ల‌బ్ధిదారుల్లో ఆరు రాష్ట్రాల్లోని 763 గ్రామాల ప్ర‌జ‌లు ఉన్నారు. 

అరుదైన అవ‌కాశం..ఒక్క‌రోజు క‌లెక్ట‌ర్‌గా బాలిక‌..!

అనంత‌పురం: అంత‌ర్జాతీయ బాలికా దినోత్స‌వం సంద‌ర్భంగా అనంత‌పురం జిల్లాలో బాలిక‌ల‌కు ఉన్న‌త గౌర‌వం ద‌క్కిది. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లా క‌లెక్ట‌ర్ గంధం చంద్రుడు ఓ వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోని విద్యార్థినుల‌ను లాట‌రీ ప‌ద్ధ‌తిలో ఎంపిక చేసి ఒక్క‌రోజు అధికారులుగా బాధ్య‌త‌లు నిర్వ‌హించే అవ‌కాశం క‌ల్పించారు. ఎంపికైన బాలిక‌ల్లో ఇంట‌ర్ చ‌దువుతున్న విద్యార్థిని శ్రావ‌ణి ఒక్క రోజు జిల్లా క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.  క‌లెక్ట‌ర్ గంధం చంద్రుడు, జాయింట్ క‌లెక్ట‌ర్ నిశాంత్ కుమార్‌తో పాటు ఇత‌ర జిల్లా అధికారులు విద్యార్థిని శ్రావ‌ణిని స్వ‌యంగా ఆహ్వానించి క‌లెక్ట‌ర్ కుర్చీలో కూర్చోబెట్టారు. దిశ చ‌ట్టం కింద న‌మోదైన కేసులో బాధిత బాలిక‌కు ప‌రిహారం ఇచ్చే ద‌స్త్రంపై ఒక్క‌రోజు క‌లెక్ట‌ర్ శ్రావ‌ణి సంత‌కం చేశారు. ఒక్క‌రోజు జాయింట్ క‌లెక్ట‌ర్లుగా మ‌ధుశ్రీ‌, స‌హ‌స్ర బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అనంత‌పురం జిల్లా వ్యాప్తంగా 63 మండ‌లాల్లో త‌హ‌శీల్దార్లుగా బాలిక‌లు ఒక్క‌రోజు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. జిల్లా క‌లెక్ట‌ర్ మొద‌లు, జేసీ, ఆర్‌డిఓ , త‌హ‌శీల్లార్ తో పాటు స‌మాచార పౌర సంబంధాల అధికారి, ఇత‌ర శాఖ‌ల అధికారుల బాధ్య‌త‌ల‌ను బాలిక‌లే చేప‌ట్టారు. క‌లెక్ట‌రేట్ తో పాటు మండ‌ల కేంద్రాల్లో బాలికా దినోత్స‌వాన్ని ఇలా వినూత్నంగా నిర్వ‌హించారు. 

Post a Comment

0 Comments