ఏపీలో మ‌రో ఆల‌యంపై దాడి..ఆంజ‌నేయుడి విగ్ర‌హం ధ్వంసం

అనంత‌పురం జిల్లా(క‌ళ్యాణ‌దుర్గం): అంత‌ర్వేదిలో ర‌థం ద‌గ్ధం మొద‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  దుర్గ గుడిలో సింహాల విగ్ర‌హాలు మాయం, ఆంజ‌నేయుస్వామి విగ్ర‌హం చేయి తీసివేయ‌డం, నందీశ్వురిడి విగ్ర‌హంపై దాడి చేయ‌డం లాంటి దాడులు జ‌రిగాయి. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాలు, విప‌క్షాలు, హిందుత్వ‌వాదులు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Anjaneya Swamy
anjaneya swamy

ఈ నేప‌థ్యంలో తాజాగా అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ దుర్గం మండ‌లం బుట్ట‌వానిప‌ల్లిలోని ఆల‌యంలో ఆంజ‌నేయుడి విగ్ర‌హాన్ని దుండ‌గులు ధ్వంసం చేశారు. గ్రామ శివారులోని కొల్లూరు ఆంజ‌నేయ‌స్వామి ఆల‌యంపై ఉన్న ఆంజ‌నేయ విగ్ర‌హాన్ని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ధ్వంసం చేసిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న స్థానికంగా సంచ‌ల‌నం రేపింది. తాము ఎంతో ప‌విత్రంగా చూసుకునే ఆల‌యంలో ఇటువంటి దుర్ఘ‌ట‌న జ‌ర‌గ‌డం త‌మ‌ను భ‌య‌బ్రాంతుకుల‌కు గురిచేస్తోంద‌ని స్థానికులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. సంఘ‌ట‌న స్థలాన్ని క‌ళ్యాణ‌దుర్గం టిడిపి నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జి ఉమామ‌హేశ్వ‌ర నాయుడు ప‌రిశీలించారు. విగ్ర‌హాల ధ్వంసం హేయ‌మైన చ‌ర్య అని..దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని చెప్పారు. బాధ్యుల‌ను వెంట‌నే గుర్తించి క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఆల‌యాన్ని డిఎస్పీ వెంక‌ట ర‌మ‌ణ ప‌రిశీలించి వివ‌రాలు సేక‌రించారు. 

Post a Comment

0 Comments